ఏమో ఇప్పుడు ఇదే వార్తలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నిజంగానే ఇప్పుడు జెర్సీ సినిమా ఓ చనిపోయిన క్రికెటర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం నాని జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉంది జెర్సీ. మరో నెల రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఎప్రిల్ 19న జెర్సీ ప్రేక్షకుల ముందుకొస్తుంది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మళ్లీ రావా తర్వాత ఈయన తెరకెక్కిస్తున్న సినిమా ఇది కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
పైగా అప్ కమింగ్ దర్శకున్ని నమ్మి రెండు భారీ ఫ్లాపుల తర్వాత నాని చేస్తున్న సినిమా ఇది. అన్నింటికీ మించి క్రికెట్ నేపథ్యంలో వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రం ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ లో సంచలనాలు సృష్టించిన రంజీ క్రికెటర్ రమన్ లాంబా జీవితం ఆధారంగా తెరకెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ టీజర్.. ఈ చిత్ర కథను బట్టి చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఇది రమన్ లాంబా జీవితమే అని ప్రచారం జరుగుతుంది. 80-90వ దశకంలో ఇండియన్ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగాడు రమన్ లాంబ.
ఇండియన్ టీమ్ కు ఎంపికై అప్పుడప్పుడే ఎదుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు జెర్సీ సినిమాలో కూడా క్రికెటర్ గా ఎదగాలని బలంగా కోరుకునే ఓ 35 ఏళ్ల వ్యక్తి కథ ఇది. లాంబ కూడా 30 వయసు దాటిన తర్వాతే రంజీ క్రికెట్లో సక్సెస్ అయ్యాడు. అన్నింటికి మించి జెర్సీ సినిమాకు నెగిటివ్ క్లైమాక్స్ ఉంటుందని తెలుస్తుంది.. ఇందులో నాని చివర్లో చనిపోతాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయనేది సినిమా విడుదలైన తర్వాత కన్ఫర్మ్ కాదు. అది తెలియాలంటే ఎప్రిల్ 19 వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nani, Telugu Cinema, Tollywood