హిందీలో నాని సినిమా... రూ.40 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌లు నటించిన సూపర్ హిట్ చిత్రం 'జెర్సీ' సినిమా హిందీలో రీమేక్ కానుంది.

news18-telugu
Updated: July 27, 2019, 10:13 AM IST
హిందీలో నాని సినిమా... రూ.40 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో
జెర్సీ సినిమా పోస్టర్ Photo: Instagram.com/nameisnani
  • Share this:
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌లు నటించిన సూపర్ హిట్ చిత్రం 'జెర్సీ' సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమాను తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో వచ్చిన సినిమా కావడంతో.. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో జెర్సీ పై కన్నేసిన కరణ్ జోహార్ హిందీలో రీమేక్ చేయాడానికి ఆసక్తి చూపుతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా ఇటీవలే తెలుగు 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' తో సంచలన విజయం అందుకున్న షాహిద్ కపూర్ ఈ 'జెర్సీ' రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంకో విషయం ఏమంటే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ధర్మ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ సినిమాలో నటించడానికి షాహిద్‌ కపూర్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు డిమాండ్‌ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల టాక్.  షాహిద్‌ ఇందుకు అర్హుడేనని భావించిన కరణ్‌ కూడా.. షాహిద్ డిమాండ్‌కు సరే అన్నాడట. 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

అది అలా ఉంటే తెలుగు సినిమాలకు హిందీలో రోజురోజుకీ ఆదరణ పెరిగిపోతోంది. ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాల కూడా హిందీలో రీమేక్‌ కానుంది. మరోపక్క కరణ్ జోహార్.. విజయ్‌ దేవరకొండ నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను రీమేక్‌ చేస్తానని సినిమా విడుదలవ్వక ముందే ప్రకటించాడు.
First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు