లైగింక వేధింపులపై శ్రద్ధా శ్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు.. తనపై ఆ దాడి జరిగినపుడు..

‘జెర్సీ’ సినిమాతో కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమెకు మొదటి సినిమానే మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. తాజాగా ఈ భామ లైంగిలక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: August 2, 2019, 2:57 PM IST
లైగింక వేధింపులపై శ్రద్ధా శ్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు.. తనపై ఆ దాడి జరిగినపుడు..
శ్రద్ధా శ్రీనాథ్ ఫోటో షూట్
  • Share this:
‘జెర్సీ’ సినిమాతో కన్నడ భామ శ్రద్ద శ్రీనాథ్ అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈమెకు మొదటి సినిమానే మంచి బ్రేక్ తెచ్చిపెట్టింది. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఒక సగటు ఇల్లాలు వంటి ఏ పాత్రలోనైనా తాను ఒదిగిపోగలనని కేవలం ఈ ఒక్క సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది శ్రద్ద శ్రీనాథ్. తాజాగా ఈ భామ 'నేర్కొండ పార్వాయ్' అనే సినిమాలో నటించింది. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి పాత్రలో నటించింది శ్రద్ద శ్రీనాథ్. ఈ సినిమా హిందీలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమాకు రీమేక్. ఐతే ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు తన అనుభవాలు ఎలా ఉన్నాయనే దానిపై  తాజాగా ఆంగ్ల మీడియా సంస్థ కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది శ్రద్ద శ్రీనాథ్.ఈ ఇంటర్వ్యూలో శ్రద్ద శ్రీనాథ్ మీటూ ఉద్యమం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సరికొత్త విప్లవం రావాలంటోంది. దీనికి మీటూ ఒక్కటే సరిపోదని ఆసక్తికరంగా స్పందించింది శ్రద్ద.

శ్రద్ధా శ్రీనాథ్ (ఫైల్ ఫోటో)


ఇటీవల మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందించిన శ్రద్ద శ్రీనాథ్.. మీటూ లాంటి ఉద్యమం ఒక్కటే సెక్సువల్ హరాస్మెంట్ లను తగ్గించలేదని, ప్రతీ ఒక్క సెలబ్రిటీ నోరు విప్పితే గానీ, కీచకుల ఆట కట్టించలేమని పేర్కొంది. అప్పుడే సమాజంలో సరైన మార్పు వస్తుందని ఘాటుగా మాట్లాడింది శ్రద్ద శ్రీనాథ్. నేర్కొండ పార్వాయ్' సినిమాలో ఆ పాత్రలో భాగంగా నాపై లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ సమయంలో నాకు నిర్భయకు సంబందించిన ఆలోచనలే మెదడులో మెదిలాయి. ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుంది? రాక్షకుల నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటుంది? ఇలాంటి ఆలోచనలతో సతమతమయ్యానని తెలిపింది. ఏ అమ్మాయైనా తనపై లైంగిక దాడి జరిగిందని చెప్పగానే.. ఎలా జరిగింది? అన్నట్లుగా ఆమెనే ప్రశ్నిస్తారు తప్ప నిందితులను మాత్రం ఒక్క మాట కూడా అనరు. అందుకే భయపడి ఎవరూ ముందుకు వచ్చి ఇలాంటి సంఘటనలు చెప్పడం లేదన్నారు. ప్రస్తుత సమాజంలో లైంగిక వేధింపులంటే నవ్వులాటగా మారింది. దీనిపై పార్టీల్లో జోకులేసుకునే దిగజారిన పరిస్థితి వచ్చేసిందని విషయాన్ని చాలా ఆవేదనగా చెప్పింది. 
First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading