హోమ్ /వార్తలు /సినిమా /

సంక్రాంతి రోజున గుమ్మడికాయ కొట్టిన నాని..

సంక్రాంతి రోజున గుమ్మడికాయ కొట్టిన నాని..

హీరో నాని

హీరో నాని

గతేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని.. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో అంతగా మురిపించలేకపోయాడు. ఈ యేడాది మాత్రం తనను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించాడు.

ఇంకా చదవండి ...

గతేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని.. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో అంతగా మురిపించలేకపోయాడు. ఈ యేడాది మాత్రం తనను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాడు. ‘అష్టాచెమ్మా’ ‘జెంటిల్మెన్’ సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సంక్రాంతి రోజున కంప్లీట్ అయింది. దీంతో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలియజేసాడు. సంక్రాంతికి ముగించాము. ఉగాదికి మొదలెడదాము అంటూ తెలుగులో ట్వీట్ చేసాడు. ‘వీ’ చిత్రం ఫుల్ లెంగ్త్ వయలెన్స్ బేస్ట్ మూవీగా దర్శకుడు ఇంద్రగంటి తెరకెక్కించడాడట. ఈ సినిమాకు ‘సైరా’ కు సంగీతం అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు, నివేధా థామస్, అదిథి రావు హైదరిలు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఉగాది కానుకగా మార్చి 25న  ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు నాని.. శివనిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు.

First published:

Tags: Aditi Rao Hydari, Nani, Nani V Movie, Nivetha Thomas, Sudheer Babu

ఉత్తమ కథలు