నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. నాని మూడు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే..
నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది.ఐనా ఫస్ట్ డే ఈ సినిమా బాగానే కలెక్షన్లను రాబట్టింది. ఫస్ట్ డే గ్యాంగ్ లీడర్ ఆ రికార్డ్ బద్ధలుకొట్టేలా కనిపిస్తుంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పటికే ఓవర్సీస్లో కూడా గ్యాంగ్ లీడర్ దుమ్ము దులుపుతోంది. విక్రమ్ కే కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది.
నాని ‘గ్యాంగ్ లీడర్’ కలెక్షన్స్ (Twitter/Photo)
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్ లీడర్ మంచి వసూళ్లనే సాధించింది. ఆది వారం కూడా దాదాపు అన్ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కళకళలాడింది. నైజాంలో తొలిరోజు రూ. 2.02 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజు రూ.1.48 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం కూడా రూ.2 కోట్ల వసూళ్లు కలిపితే... తెలంగానలో రూ.5 కోట్లు వసూళ్లు సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నాని ‘గ్యాంగ్ లీడర్’లో లక్ష్మీ (Twitter/Photo)
ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.10 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా..ఏపీలోని రూ.4.5 కోట్ల వసూళు చేసినట్టు సమాచారం. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.10 కోట్ల వరుకు వసూళు చేసినట్టు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మరో రూ.3 కోట్టు వసూలు చేసినట్టు సమాచారం. గ్యాంగ్ లీడర్ విషయానికొస్తే..ఎంసీఏ, జెర్సీ తర్వాత నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
నాని ‘గ్యాంగ్ లీడర్ (Twitter/Photo)
సినిమాలో కామెడీ అక్కడక్కడా బాగానే వర్కవుట్ కావడంతో రొటీన్ కథ అయినా కూడా నాని మేనియాలో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే రూ.30 కోట్ల షేర్ రావాలి. ప్రస్తుతానికి అన్ని ఏరియాల్లో రూ.15 కోట్ల వరకు వచ్చింది. ఈ సినిమా సేఫ్ కావాలంటే మరో రూ.15 కోట్లు వసూలు చేయాలి. వచ్చిన టాక్ చూస్తుంటే ఇంత రావడం అంత సులభం కాదు. అదృష్టం బాగుంటే బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయినా అవ్వొచ్చు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.