హోమ్ /వార్తలు /సినిమా /

Gang Leader twitter review : నానిస్ గ్యాంగ్ లీడర్.. ట్వీట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..

Gang Leader twitter review : నానిస్ గ్యాంగ్ లీడర్.. ట్వీట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..

గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్

గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్

Gang Leader twitter review : నాచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా  'నానిస్ గ్యాంగ్ లీడర్'. నాని 'జెర్సీ' హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

  నాచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించిన సినిమా  'నానిస్ గ్యాంగ్ లీడర్'.  జెర్సీ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు అటు దర్శకుడు విక్రమ్‌కు కూడా ఈ మధ్య కాలంలో ఆయన స్ధాయికి, సామర్థ్యానికి తగ్గ హిట్ పడలేదు. దీంతో విక్రమ్ కసితోనే ఈ సినిమాను తెరకెక్కించారు.సెన్సార్ నుండి ‘U/A’ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా హ్యుమర్‌తో కూడిన రివేంజ్ స్టోరీ అని చిత్ర బృందం చెబుతుంది. అంతేకాదు సినిమా మొత్తం డిఫరెంట్ స్క్రీన్ ప్లే‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉందంటున్నారు. అది అలా ఉంటే  'నానిస్ గ్యాంగ్ లీడర్' ప్రపంచ వ్యాప్తంగా రూ.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. అందులో కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.90 కోట్లు.. కాగా.. మిగితా దేశ వ్యాప్తంగా  రూ. 1.80 కోట్లు.. ఓవర్సీస్ రూ. 5.50 కోట్ల బిజినెస్ చేసిందని టాక్.

  RX 100 ఫేమ్ హీరో కార్తికేయ విలన్‌గా నటిస్తుండగా.. నాని రివేంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారధిగా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా  పరిచయమవుతోంది. వీరితో పాటు సీనియర్ నటులు లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతోంది.

  కాగా..  'నానిస్ గ్యాంగ్ లీడర్' సినిమాకు యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. దీంతో ఈ సినిమాను అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందీ.. విక్రమ్ టేకింగ్ ఆకట్టుకుంటుందా .. అసలు సినిమా గురించి ఏమంటున్నారో... చూద్దాం..  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Gang Leader, Kartikeya, Nani, Telugu Cinema News

  ఉత్తమ కథలు