నాని ఏదో రాంగ్ టైమ్ లో గ్యాంగ్ లీడర్ టైటిల్ ముట్టుకున్నట్లున్నాడు. అందుకే షూటింగ్ మొదలవ్వక ముందే షాక్ కొడుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టిన రోజు నుంచి మెగా ఫ్యాన్స్ దాన్ని మార్చేయాలని పట్టుబట్టారు. ఆ మధ్య మూడు నాలుగు రోజులు మరో పనేది పెట్టుకోకుండా నానిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు వాళ్లు. ఇక ఆ తర్వాత కాస్త చల్లబడిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో గ్యాంగ్ లీడర్ రచ్చ మొదలైంది. ఈ సారి మరో గ్యాంగ్ బయల్దేరింది. దీన్ని చూసి నానికి లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి.
ఈ సారి కొత్త బ్యాచ్ ఒకటి వచ్చి గ్యాంగ్ లీడర్ తమ టైటిల్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు నానితో పాటు విక్రమ్ కే కుమార్ కు కూడా చుక్కలు చూపించారు. తెలుగు ఇండస్ట్రీలో గ్యాంగ్ లీడర్ అంటే అది ఒక్క చిరంజీవి మాత్రమే అని.. ఆయన్ని కాదని మరెవరూ ఈ టైటిల్ పెట్టుకునే అర్హత లేదంటున్నారు వాళ్లు. నాని మంచి హీరో అయినా కూడా చిరంజీవికి తప్ప మరో హీరోకు గ్యాంగ్ లీడర్ టైటిల్ వాడుకునే అవకాశమే లేదంటున్నారు వాళ్లు. ఊహించని ఈ పరిణామంతో నాని కూడా షాక్ అవుతున్నాడు.
ఇక ఇప్పుడు మాణిక్యం మూవీస్ అనే ఓ నిర్మాణ సంస్థలో మోహన్ కృష్ణ అనే నిర్మాత గ్యాంగ్ లీడర్ టైటిల్ ఆర్నెళ్ల కిందే ఫిల్మ్ ఛాంబర్లో రిజిష్టర్ చేయించాడు. షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. పోస్టర్ కూడా విడుదల చేసారు. ఇలాంటి సమయంలో నాని కూడా తన సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టుకోవడం వాళ్లకు నచ్చడం లేదు. దీనిపై మీరే న్యాయం చేయాలంటూ వాళ్లు మీడియా ముందుకొచ్చారు. అసలు తమ సినిమాకు అనుకున్న టైటిల్ నాని ఎలా వాడేసుకుంటాడంటూ వాళ్లు రచ్చ చేస్తున్నారు.
దాంతో ఇప్పుడు నాని అండ్ టీంకు తలనొప్పులు తప్పడం లేదు. 8 ఏళ్ల చిన్న పాప.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వయసు ఉన్న మహిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడర్.. అతడే మన గ్యాంగ్ లీడర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడర్ కథ. మొత్తానికి గ్యాండ్ లీడర్ టైటిల్ అనౌన్స్ చేసినపుడు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం నానికి రోజూ చుక్కలు కనిపిస్తూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Nani, Telugu Cinema, Tollywood, Vikram K Kumar