గతేడాది ‘అంటే సుందరానికీ’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నాని.. ఈ సారి దసరా (Dasara) రూపంలో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. నాని జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మార్చి 26వ తేదీన అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాసెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పడం విశేషం. ఆడియో మ్యూట్, డైలాగ్స్ కట్స్ అన్నీ కలిపి చూసుకుంటే మొత్తం 36 చోట్ల కట్స్ చెప్పారట.
బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర పోషిస్తున్నారు నాని. ధరణిగా నాని కనిపించనుండగా.. వెన్నెలగా కీర్తి సురేష్ ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనుంది. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయంటూ చిత్ర యూనిట్ చెబుతోంది. తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ దసరా మూవీ రిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. టీజర్, ట్రైలర్‌తో దుమ్ములేపిన దసరాకు ఓ రేంజ్‌లో బిజినెస్ జరుగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను రూ. 28 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పెరుగుతున్న డిమాండ్ కారణంగా తెలుగు రాష్ట్రాలల్లో వివిధ ప్రాంతాలకు రూ. 40 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Nani, Tollywood actor