Nani - Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈయన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాను విజయ దశమి రోజున ప్రకటించారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.
దసరా’ సినిమాకు సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తోంది. కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఆమెను చిత్రబృందం ఇప్పటికే కలిసిందని.. ఆమె కూడా ఓకే చెప్పిందని అంటున్నారు.
The Pooja ceremony of Natural star @NameisNani & @KeerthyOfficial's Rural MASS Entertainer #Dasara movie was done today on an auspicious & a grand note??
- https://t.co/jt3sQZaOTP@odela_srikanth @Music_Santhosh @sathyaDP @NavinNooli @sudhakarcheruk5 @SLVCinemasOffl pic.twitter.com/godSe8CYyT
— BA Raju's Team (@baraju_SuperHit) February 16, 2022
ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై భారీగా ఎత్తున సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారeయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారు. అంతేకాదు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. తెలంగాణ యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ని కూడా నియమించుకున్నాడు కూడా.
Ali - Vikram : ఆలీ సినిమాలో చియాన్ విక్రమ్ విలన్‌గా నటించిన ఈ సినిమా తెలుసా..
ప్రస్తుతం నాని నటించిన ‘అయితే సుందరానికి’ త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. ధసరాతో పాటు నాని చేతిలో పలు చిత్రాలన్నాయి. వీటిని కూడా త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. దసరా చిత్రాన్ని మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఆగష్టు వరకు కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ‘దసరా’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh, Tollywood