Nani | Dasara : నాచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా అంటే సుందరానికీ అనే రొమాంటిక్ కామెడీతో పలకరించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే ఆయన ఓ మాంచి మాస్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘దసరా’ పేరుతో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కాగా తాజాగా మరో కొత్త షెడ్యూల్‌ను టీమ్ స్టార్ట్ చేసింది. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో విలేజ్ నేపథ్యంలోని వస్తున్న కథ. నాని ఈ సినిమాలో మాంచి మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆయన సరసన నాయికగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. గతంలో కీర్తి సురేష్, నాని సరసన 'నేను లోకల్' అనే సినిమాలో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్’లో మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం ఇక్కడ ఒక భారీ సెట్‌ను వేశారట టీమ్. సినిమాలో మేజర్ పార్టు షూటింగు ఈ సెట్లో జరగనుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విషయం ఏమంటే.. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని టాక్. దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఆమెను చిత్రబృందం ఇప్పటికే కలిసిందని.. ఆమె కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో పాటు ఈ సినిమా స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది.
I join :)
This one’s a long one.
Next Schedule Begins #Dasara pic.twitter.com/dQ5iXqq0MP
— Nani (@NameisNani) July 1, 2022
‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది. ఈ లుక్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు నాని. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నారట నాని. ఇక నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. (Ante Sundaraniki) ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేశారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh, Tollywood news