హోమ్ /వార్తలు /సినిమా /

Nani | Dasara : నాని ప్యాన్ ఇండియా సినిమాకు భారీ క్రేజ్.. రికార్డ్ ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్..

Nani | Dasara : నాని ప్యాన్ ఇండియా సినిమాకు భారీ క్రేజ్.. రికార్డ్ ధరకు నాన్ థియేట్రికల్ రైట్స్..

Nani Dasara  Photo : Twitter

Nani Dasara Photo : Twitter

Nani | Dasara :  నాచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలను చేస్తున్నారు.  అందులో భాగంగా ఆయన ఓ మాంచి మాస్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘దసరా’ పేరుతో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

Nani | Dasara :  నాచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలను చేస్తున్నారు.  అందులో భాగంగా ఆయన తాజాగా అంటే సుందరానికీ (Ante Sundaraniki)అనే రొమాంటిక్ కామెడీతో పలకరించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే ఆయన ఓ మాంచి మాస్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ‘దసరా’  ( Dasara)పేరుతో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కాగా తాజాగా మరో కొత్త షెడ్యూల్‌‌ను టీమ్ స్టార్ట్ చేసింది. ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఓటీటీ, హిందీ, శాటిలైట్ అన్నీ కలుపుకొని ఈ సినిమాకి రూ.47 కోట్లు ఆఫర్ వచ్చిందట. దీనికి నిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయట. ఇక ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో  విలేజ్ నేపథ్యంలోని వస్తున్న కథ. నాని ఈ సినిమాలో మాంచి మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.  ఆయన సరసన నాయికగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు.  గతంలో కీర్తి సురేష్, నాని సరసన 'నేను లోకల్' అనే సినిమాలో నటించారు.  ఇక తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్’లో మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం ఇక్కడ ఒక భారీ సెట్‌ను వేశారట టీమ్. సినిమాలో మేజర్ పార్టు షూటింగు ఈ సెట్లో జరగనుందని అంటున్నారు.

ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని టాక్. దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అది అలా ఉంటే ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారట. అందులో భాగంగా ఆమెను చిత్రబృందం ఇప్పటికే కలిసిందని.. ఆమె కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది.

‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు నాని.  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నారట నాని. ఇక నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. (Ante Sundaraniki) ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేశారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.

First published:

Tags: Nani, Tollywood news

ఉత్తమ కథలు