వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. చిత్రంలో నజ్రియా నజీం (Nazriya Nazim) హీరోయిన్గా నటించగా.. నదియా, హర్ష వర్ధన్, రోషిని కీలక పాత్రలు పోషించారు. జూన్ 10వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. నిన్నటితో ఈ సినిమా నాలుగు రోజుల రన్ పూర్తిచేసుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ వేదికపై మాట్లాడిన నాని.. ఇలాంటి మంచి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయని చెప్పారు. ‘అంటే.. సుందరానికీ’ కూడా అరుదైన సినిమానే అని చెప్పిన నాని.. ఇలాంటి చిత్రాలను మనందరం ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా చేస్తున్న కొత్త అడుగులో భాగమవుతామని అన్నారు. ఇది మనందరి సినిమా అని, ఇది మనందరి విజయం.. మనందరి సెలబ్రేషన్ అని అన్నారు. ఇప్పటివరకు అంటే.. సుందరానికీ సినిమాకు వస్తున్న స్పందన, అభిమానుల సందేశాలు చూసి కడుపు నిండిపోయింది అని నాని అన్నారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. అంటే సుందరానికీ లాంటి వైవిధ్యమైన కథను ఒప్పుకున్న నానికి, నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ‘అంటే సుందరానికీ’ సినిమా ఓ క్లాసిక్ మూవీ అని, జంధ్యాల గారి ''అహ నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ'' లాంటి సినిమా ఇది అని పేర్కొన్నారు. మా బ్యానర్లో ఇది ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమిది అని చెప్పారు.
మూడు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 14.95 కోట్ల నెట్, 26.25 కోట్ల గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. నాలుగో రోజు రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఈ అంటే సుందరానికీ మొత్తం 30 కోట్ల బిజినెస్ చేసి 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగింది. ఈ సినిమాకు ఇంకా 17 కోట్ల రూపాయలు వస్తే లాభాల బాటలోకి వచ్చేస్తుంది. ఈ టార్గెట్ రీచ్ కావాలంటే ఈ వారం కూడా తొలి మూడు రోజుల్లో లాగానే సుందరం వసూళ్ల జోరు కొనసాగాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani, Tollywood