హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Ante Sundaraniki Teaser : నాని ‘అంటే సుందరానికీ’ టీజర్ విడుదల.. రిలీజ్ డేట్ ప్రకటన..

Nani - Ante Sundaraniki Teaser : నాని ‘అంటే సుందరానికీ’ టీజర్ విడుదల.. రిలీజ్ డేట్ ప్రకటన..

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌, రిలీజ్ డేట్ (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్‌, రిలీజ్ డేట్ (Twitter/Photo)

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. తాజాగా ‘అంటే సుందరానికి’ మూవీ నుంచి టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఇంకా చదవండి ...

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. గతేడాది ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో పలకరించారు. ఇందులో ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో  ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో పునర్జన్మల నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.

ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. అయితే.. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా నాని నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీకి సంబంధించి టీజర్ విడుదల చేశారు.

ఈ టీజర్‌లో నాని పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో ఆయుష్య  హోమం చేస్తారు. అది సుందరానికి ఇష్టం ఉండదు. మీ చాదస్తం తగేలయ్యా.. ఇంకా రెండు హోమాలు చేస్తే.. అన్ని హోమాలు చేసిన వాడిగా గిన్నీస్ బుక్‌లో ఎక్కోచ్చు అంటూ కాస్త ఏడూస్తూ చెప్పడం ఫన్నీగా ఉంది. ఈ పొగకు నేను చచ్చిపోతున్నాను. నీకు అన్ని గండాలున్నాయి. బయటకు వస్తే.. ద్విచక్ర వాహన గండం, నీళ్లలోకి వెళితే.. జల గండం.. నడిస్తే రోడ్డు గండటం.. కుర్చుంటే కుర్చీ గండం అంటూ కాస్త వెటకారంగా హిందూ ధర్మ శాస్త్రాలను హోమాలను అపహాస్యం చేసేలా ఈ టీజర్‌ను కట్ చేసినట్టు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా గండాలు.. హోమాలు అంటే మొహం పగిలిపోద్ది అంటూ హోమాలు చేయడం ద్వారా ఇబ్బంది ఫీలయ్యే ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని నటించారు.

Ravi Teja - Rama Rao On Duty : రవితేజ ‘రామా రావు’ ఆన్ డ్యూటీ మూవీ నుంచి టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ?

ఈ సందర్భంగా చిత్ర యూనిట్.. మా వాడి జాతకం ప్రకారం Barthday Homam జరిగిన 108 రోజులు వరకు బయటకు రాకూడదన్నారు. అందకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించానికి థియేటర్స్‌కు వస్తున్నాడు ట్వీట్ చేశారు. పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే బ్రాణ్మణ యువకుడు విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. పోస్టర్‌లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Prabhas - Maruthi : ప్రభాస్, మారుతి ‘రాజా డీలక్స్’ మూవీపై అదిరిపోయే లేటెస్ట్ క్రేజీ అప్‌డేట్..

‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్‌గా రానుంది.

First published:

Tags: Ante sundaraniki, Hero nani, Tollywood

ఉత్తమ కథలు