హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. హిట్టు కావాలంటే ఎంత రాబట్టాలి..

Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత.. హిట్టు కావాలంటే ఎంత రాబట్టాలి..

నాని ‘అంటే సుందరానికీ’ టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (Twitter/Photo)

Nani | Ante Sundaraniki : నాని (Nani) నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

ఇంకా చదవండి ...

Nani - Ante Sundaraniki:  నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించారు. ఈ సినిమాను సెన్సార్ (Censor) సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా 2 గంటల 56 నిమిషాల నిడివి ఉంది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు.  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో (జూన్ 10)న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..  విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు.

ఈ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ (Theatrical Pre Release Business) విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం ) - రూ. 10 కోట్లు                                                                                                      రాయలసీమ (సీడెడ్) - రూ. 4 కోట్లు                                                                                                      ఆంధ్ర ప్రదేశ్  - రూ. 10 కోట్లు

మొత్తంగా తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 24 కోట్లు                                                            కర్ణాటక + రెస్టాఫ్ భారత్ - రూ. 2.50 కోట్లు                                                                                          ఓవర్సీస్ (విదేశాలు) - రూ. 3.50 కోట్లు                                                                                                ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 31 కోట్లు రాబట్టాలి.

ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా నైజాంలో 210 థియేటర్స్‌లో విడుదల కానుంది. మరోవైపు రాయలసీమలో 90, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 250 + థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 550 స్క్రీన్స్‌లో విడుదలవుతోంది.   ఒక కర్ణాటక, రెస్టాఫ్ భారత్ కలిపి 150 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 400  కలిపి మొత్తంగా మూడు భాషల్లో 1100 పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల కానుంది.

Nayanthara Wedding : నయనతార, నమ్రత సహా తమ కంటే తక్కువ వయసు వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

అంటే సుందరానికీ సినిమాలో టైటిల్ పాత్రధారి సుందరంగా నాని నటిస్తే.., లీలా థామస్‌‌గా నజ్రియాగా నటించారు. ఇప్పటికే  విడుదలైన ట్రైలర్‌ ఓ ఫన్ రైడ్‌లా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నరేష్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ మూవీతో నాని బాక్సాఫీస్ దగ్గర మరో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Ante sundaraniki, Nani, Tollywood

ఉత్తమ కథలు