వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. చిత్రంలో నజ్రియా నజీం (Nazriya Nazim) హీరోయిన్గా నటించగా.. నదియా, హర్ష వర్ధన్, రోషిని కీలక పాత్రలు పోషించారు. జూన్ 10వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటిరోజుతో పోల్చితే రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్‌లో పెద్దగా డ్రాప్ కనిపించలేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ సుందరం వసూళ్లు చూస్తే..
Day 1: 3.87Cr
Day 2: 3.48Cr
Day 3: 3.05Cr
AP-TG టోటల్: 10.40 కోట్ల నెట్(17.60 కోట్ల రూపాయల గ్రాస్) వసూలైనట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇక మూడో రోజు ఏరియా వైజ్ డీటెయిల్ రిపోర్ట్ చూద్దామా..
Nizam: 1.44Cr
Ceeded: 32L
UA: 33L
East: 20L
West: 17L
Guntur: 20L
Krishna: 23L
Nellore: 16L
AP-TG టోటల్: 3.05CR(5.20CR~ Gross)
మూడో రోజుకు గాను మొత్తం అన్ని ఏరియాల్లో కలిపి 3.05CR నెట్ (5.20CR~ గ్రాస్) వసూలయింది. ఇకపోతే ఈ మూడు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 14.95 కోట్ల నెట్, 26.25 కోట్ల గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఈ అంటే సుందరానికీ మొత్తం 30 కోట్ల బిజినెస్ చేసి 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగింది. ఈ సినిమాకు ఇంకా 17 కోట్ల రూపాయలు వస్తే లాభాల బాటలోకి వచ్చేస్తుంది. ఈ టార్గెట్ రీచ్ కావాలంటే ఈ వారం కూడా తొలి మూడు రోజుల్లో లాగానే సుందరం వసూళ్ల జోరు కొనసాగాల్సిన అవసరం ఉంది. సో.. చూడాలి మరి ఈ వారంలో అంటే సుందరానికి బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేస్తాడా లేక రేసు నుంచి తప్పుకుంటాడా అనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani, Tollywood