నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. చిత్రంలో నాని సరసన నజ్రియా నజీం (Nazriya Nazim) హీరోయిన్గా నటించగా.. నదియా, హర్ష వర్ధన్, రోషిని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నేడు (జూన్ 10) ఈ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా నుంచి వదిలిన అప్డేట్స్ భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై తమ తమ అభిప్రాయలు తెలుపుతున్నారు. మరి వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి? సినిమా ఎలా ఉందంటున్నారో చూద్దామా..
ఇప్పటివరకు ఆడియన్స్ చెబుతున్న రిపోర్ట్స్‌ని బట్టి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోందని చెప్పుకోవచ్చు. మరోసారి హీరో నాని తన నటనతో మెస్మరైజ్ చేశారని, దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాను ఎంటర్టైనింగ్ పంథాలో చెబుతూ సక్సెస్ అయ్యారని అంటున్నారు ఆడియన్స్. అసలు పాయింట్‌ను ఎక్కడా రివీల్ చేయకుండా సినిమాను థ్రిల్లింగ్‌గా నడిపించారని అంటున్నారు. నేచురల్ కామెడీ, ఎమోషన్స్ చక్కగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు.
ఇకపోతే ఈ అంటే సుందరానికీ నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అక్కడక్క కొన్ని కామెడీ బిట్స్ తప్పితే బాగా లెంగ్తి మూవీ ఇది. ఫస్టాఫ్ చాలా బోరింగ్ అంటూ కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా కామెడీతో అలరిస్తుందని అంటున్నారు ఆడియన్స్. మరి కాసేపట్లో న్యూస్ 18 నుంచి అంటే సుందరానికీ పూర్తి రివ్యూ అందించి సినిమా ఎలా ఉందో చెబుతాం.
#AnteSundaraniki
Talk bagundi but hype ledu.
Wishing @NameisNani film will perform well at box-office.
— ravi_r (@raviraavi4) June 10, 2022
#AnteSundaraniki
One of the finest entertainer of the year for sure ????❤️ hilarious first half
special thanks @anupamahere role ????
@NameisNani anna❤ #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/D71onvKH58
— Rajesh (@Rajesh93651270) June 10, 2022
ఇకపోతే గత రాత్రి అంటే సుందరానికీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసి వేదికపై ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా నాని వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ అంటే సుందరానికీ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, నాని ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకున్నారు పవన్ కళ్యాణ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani