Nani : నాచురల్ స్టార్ నాని గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy) మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక అది అలా ఉంటే నాని (Nani) నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు. ఏడు మహా సముద్రాలను దాటి USAలో అడుగుపెట్టిన సుందర్ అక్కడ ఎలా లీలా థామస్‌ను కలిసారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరి వల్ల రెండు ఫ్యామిలీల్లో ఎలాంటీ పరిణామాలు జరిగాయి, సుందర్, లీలాలు ఎలా తమ లవ్‌ను విజయవంతంగా పెళ్లి వరకు తీసుకెళ్లారు.. అనేది కథగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఓ ఫన్ రైడ్‌లా ఆకట్టుకుంటోంది. నాని, నజ్రీయాతో పాటు సహాయ నటీనటులు నరేష్, నదియా, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల్లో వావ్ అనిపించారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
This June 10th!
It will be a celebration in theatres ♥️😆 🪄
Here’s the THEATRICAL TRAILER of #AnteSundaraniki 👇🏼https://t.co/1xiKIcx7e9 pic.twitter.com/pYVtxcLyPP
— Nani (@NameisNani) June 2, 2022
ఇక నాని నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది.
దసరా (Dasara) సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత (Samantha Ruth Prabhu)ను తీసుకుంటున్నారట. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో పాటు ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది. ఈ లుక్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు నాని. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ని కూడా నియమించుకున్నారట నాని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani, Kamal haasan, Nazriya Fahadh