హోమ్ /వార్తలు /సినిమా /

Nani Ante Sundaraniki : జూన్ 8న నాని అంటే సుందరానికీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే..

Nani Ante Sundaraniki : జూన్ 8న నాని అంటే సుందరానికీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే..

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ (Twitter/Photo)

Nani | Ante Sundaraniki : నాని (Nani) నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 8న నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...

Nani : నాచురల్ స్టార్ నాని గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy) మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక అది అలా ఉంటే నాని (Nani) నటిస్తోన్న మరో సినిమా ‘అంటే సుందరానికీ’.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాళ భాషల్లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సెన్సార్ సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా 2 గంటల 56 నిమిషాల నిడివి ఉంది.

ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు.  సుందర్, లీలా థామస్‌ను ఎలా కలిసారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరి వల్ల రెండు ఫ్యామిలీల్లో ఎలాంటీ పరిణామాలు జరిగాయి, సుందర్, లీలాలు ఎలా తమ లవ్‌ను విజయవంతంగా పెళ్లి వరకు తీసుకెళ్లారు.

అనేది కథగా తెలుస్తోంది.ఇప్పటికే  విడుదలైన ట్రైలర్‌ ఓ ఫన్ రైడ్‌లా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈసినిమా నుంచి ప్రోమో సాంగ్‌ను విడుదల చేసారు. ఇందులో మాస్ రాంపేజ్‌లో అదరగొట్టారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 8న హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ‘అంటే సుందరానికీ’ టీమ్ మెంబర్స్ మాత్రమే హాజరు కానున్నారు.

‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Twitter/Photo)

ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఇక నాని నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది. దసరా (Dasara) సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత (Samantha Ruth Prabhu)ను తీసుకుంటున్నారట.

Allu Aravind : టికెట్ రేట్స్ విషయమై అల్లు అరవింద్ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేసినవేనా..


ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు నాని.  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నారట నాని.

First published:

Tags: Ante sundaraniki, Nani, Tollywood

ఉత్తమ కథలు