Home /News /movies /

NANI ANTE SUNDARANIKI PAWAN KALYAN CHIEF GUEST OF ANTE SUNDARANIKI PRE RELEASE EVENT HELD AT SHIPAKALA VEDIKA HYDERABAD AT JUNE 9TH TA

Nani - Ante Sundaraniki : సుందరం కోసం పవన్ కళ్యాణ్.. ఒక రోజు ఆలస్యంగా ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి (Twitter/Photo)

‘అంటే సుందరానికీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి (Twitter/Photo)

Nani | Ante Sundaraniki : నాని (Nani) నటిస్తోన్న మరో సినిమా అంటే సుందరానికి.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 8 నుంచి 9కి పోస్ట్‌పోన్ చేసారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఇంకా చదవండి ...
    Nani : నాచురల్ స్టార్ నాని గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy) మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇక అది అలా ఉంటే నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాళ భాషల్లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను సెన్సార్ సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా 2 గంటల 56 నిమిషాల నిడివి ఉంది.

    ఇక విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్‌లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు.  తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముందుగా ఈ నెల 8న హైదరాబాద్ శిల్పాకళావేదికలో టీమ్ మెంబర్స్ మాత్రమే హాజరయ్యేలా ఈ వేడుకను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకాన్నారు. పవన్ కళ్యాణ్ జూన్ 8న బిజీగా ఉండటంతో .. ఒక రోజు ఆలస్యంగా సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు జూన్ 9న  ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.

    పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)


    అంటే సుందరానికీ సినిమాలో టైటిల్ పాత్రధారి సుందరంగా నాని నటిస్తే.., లీలా థామస్‌‌గా నజ్రియాగా నటించారు. ఇప్పటికే  విడుదలైన ట్రైలర్‌ ఓ ఫన్ రైడ్‌లా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన మలయాళీ నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా చేస్తున్నారు. నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఇక నాని నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు.



    ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది. దసరా (Dasara) సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత (Samantha Ruth Prabhu)ను తీసుకుంటున్నారట.

    Tollywood Hit Movies 2022 : RRR,KGF2, మేజర్, విక్రమ్ సహా 2022లో హిట్ స్టేటస్ అందుకున్న మూవీస్..


    ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్‌కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో  పాటు  ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్‌ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది.  ఈ లుక్‌  ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు నాని.  తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నారట నాని.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ante sundaraniki, Mythri Movie Makers, Nani, Pawan kalyan, Tollywood

    తదుపరి వార్తలు