హోమ్ /వార్తలు /సినిమా /

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ నుంచి హీరోయిన్ నజ్రియా లుక్‌కు డేట్ టైమ్ ఫిక్స్..

Nani - Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ మూవీ నుంచి హీరోయిన్ నజ్రియా లుక్‌కు డేట్ టైమ్ ఫిక్స్..

నాని ‘అంటే సుందరానికీ’ హీరోయిన్ నజ్రియా ఫహద్ లుక్ విడుదల (Twitter/Photo)

నాని ‘అంటే సుందరానికీ’ హీరోయిన్ నజ్రియా ఫహద్ లుక్ విడుదల (Twitter/Photo)

Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఈ సినిమాలో హీరోయిన్ నజ్రియా ఫహద్ లుక్‌కు ముహూర్తం ఖరారైంది.

  Nani - Ante Sundaraniki  :  నాచురల్ స్టార్ నాని ' సినిమాల విషయంలో మాములుగా స్పీడ్‌గా లేడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వడమే లేదో మరో సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. గతేడాది ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలతో పలకరించారు. ఇందులో ‘టక్ జగదీష్’ ఓటీటీ వేదికగా విడుదలైన డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో  ‘శ్యామ్ సింగరాయ్’(Shyam Singha Roy) మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో పునర్జన్మల నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా  గతేడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు.

  ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లో  కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే.. నాని .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.

  Chiranjeevi - Salman Khan God Father : సల్మాన్‌ఖాన్‌కు చిరంజీవి గ్రాండ్ వెల్కమ్.. గాడ్ ఫాదర్ షూటింగ్‌లో సల్లూ భాయ్..

  తాజాగా ఈ సినిమాకు షూటింగ్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసారు. ఇక నాని పుట్టినరోజు సందర్భంగా నాని నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీకి సంబంధించి టీజర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ నజ్రియా ఫహద్ లుక్‌ను సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో నజ్రియా.. లీలా థామస్ పాత్రలో కనిపించనుంది.

  హోమాలు చేయడం ద్వారా ఇబ్బంది ఫీలయ్యే ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని నటించారు. ఈ సినిమాను జూన్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘అంటే సుందరానికీ’ సినిమాలో హీరో పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే బ్రాణ్మణ యువకుడు విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. పోస్టర్‌లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

  RRR : ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టేసినా తెలంగాణ హైకోర్టు..

  ‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్‌గా రానుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ante sundaraniki, Natural star nani, Nazriya Fahadh, Tollywood

  ఉత్తమ కథలు