రిలీజ్ తేదీ | : | 10/6/2022 |
దర్శకుడు | : | వివేక్ ఆత్రేయ |
సంగీతం | : | వివేక్ సాగర్ |
నటీనటులు | : | నాని, నజ్రియా నదీమ్,అనుపమ పరమేశ్వరన్, నరేష్,నదియా,30 ఇయర్స్ పృథ్వీ తదితరులు.. |
సినిమా శైలి | : | కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టేనర్ |
సినిమా నిడివి | : | 2 Hr 56 Minits |
రివ్యూ : అంటే సుందరానికీ (Ante Sundaraniki)
నటీనటులు : నాని, నజ్రియా నదీమ్,అనుపమ పరమేశ్వరన్, నరేష్,నదియా,30 ఇయర్స్ పృథ్వీ తదితరులు..
ఎడిటర్: రవితేజ గిరిజాలా
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాతలు : నవీన్ యెర్నేనీ, వై. రవిశంకర్ కథ, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’.. (Ante Sundaraniki). శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ తర్వాత నాని నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. మరి ఆ అంచనాలను సుందరం అందుకున్నాడా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
అంటే సుందరానకీ కథ విషయానికొస్తే.. కస్తూరి పూర్ణ వెంకట సీతా శేష సాయి పవన రామ సుందర ప్రసాద్ (నాని).. అలియాస్ సుందర ప్రసాద్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. ఇతను చిన్నపుడు లీలా థామస్ (నజ్రియా నజీమ్) అనే అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు. వీరి మతాలు, సంప్రదాయాలు అన్ని వేరేైన వీళ్లిద్దరు ఎలా పెద్దలు ఒప్పించి తన ప్రేమకు గెలిపించుకున్నారు. అందుకు వీళ్లు ఎలాంటి గేమ్ ప్లాన్ చేసారనేదే ‘అంటే సుందరానికీ’ స్టోరీ.
కథనం..
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎపుడు 40 యేళ్ల క్రితం భారతీరాజా తీసిన ‘సీతాకోక చిలుక’ కాన్సెప్ట్‌తో ‘అంటే సుందరానికీ’ స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది వచ్చిన ‘ఉప్పెన’ కూడా దాదాపు ఇదే ఇంటర్ రిలీజన్ ప్రేమ. కానీ ’అంటే సుందరానికీ’ మాత్రం సీరియస్‌గా కాకుండా.. కామెడీ జానర్లో తెరకెక్కించాడు. ముఖ్యంగ మనుషులకు సమస్య వచ్చినపుడు కులం మతం పట్టింపు ఉండదు. అదే ఎలాంటి సమస్య లేకపోతే.. కులం, మతం ప్రాంతం మనుషులు గుర్తు చేసుకుంటారనే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ముఖ్యంగా బ్రాహ్మణుల ఇళ్లలో ఉండే ఆచార వ్యవహారాలతో పాుట.. క్రిష్టియన్స్ ఇళ్లలో ఉండే సాంప్రదాయాలను ఈ సినిమాలో చూపించారు. ఇక హీరో ఇంట్లో పెళ్లికి ఒప్పించడానికీ తనకు లైంగిక లోపం ఉన్నట్టు చెప్పడం. హీరోయిన్ ప్రెగ్నేన్సీ నాటకం ఆడటం కాస్త డ్రామెటిక్‌గా అక్కడక్కడ నవ్వుతో పాటు ప్రేక్షకులను కంగారు పెడతాయి. ముఖ్యంగా తాను అల్లుకున్న కథ బాగానే చెప్పినా.. ఉన్న స్టోరీనే తిప్పి తిప్పి చెప్పడం ఆడియన్స్‌కు బోర్ కొట్టిస్తోంది. మధ్యలో కామెడీ ఉన్నా.. ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తోంది. తాను అనుకున్న కథను బాగానే తెరకెక్కించినా.. ప్రేక్షకులకు మాత్రం ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా నిడివి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇక ఈ సినిమాకు పాటలు అంత క్యాచీగా లేకపోయినా.. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరామెన్ ఈ సినిమా ప్రతి యాంగిల్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. ఎడిటర్ ఈ కత్తెరకు ఇంకాస్త పదును పెడితే.. బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
నానిని నాచురల్ స్టార్ ఎందుకు అంటారో.. సుందరంగా అతన్ని ఈ సినిమాలో చూస్తే మరోసారి అర్ధమవుతోంది. ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. నటన విషయంలో నాని వంక పెట్టాల్సిన పనిలేదు. హీరోయిన్గా నటించిన నజ్రియా నజీమ్ లీలా థామస్ పాత్రలో చాలా క్యాజువల్‌గా నటించింది. ఈమెను చూస్తుంటే.. రాధిక ఆప్టే గుర్తుకు వస్తోంది. మరోవైపు హీరో తండ్రి పాత్రలో నటించిన నరేష్, తల్లి పాత్రలో నటించిన రోహిణి వాళ్ల పరిధి మేరకు బాగా రాణించారు. ఇక హీరోయిన తల్లి పాత్రలో నటించిన నదియా, తండ్రి పాత్రలో నటించిన అజగమ్ పెరుమాల్ నటనతో పాటు మిగతా పాత్రల్లో నటించిన హర్షవర్ధన్, జ్యోతిష్కకుడిగా శ్రీకాంత్ అయ్యంగార్, హీరో బాబాయి పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీ వాళ్ల పరిధి మేరకు నటించారు.
ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించారు. ఈ సినిమాను సెన్సార్ (Censor) సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా 2 గంటల 56 నిమిషాల నిడివి ఉంది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో (జూన్ 10)న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. విలేజ్ వాతావరణంలో పెరిగిన ఒక బ్రాహ్మణ యువకుడికీ.. ఫారిన్లో పెరిగిన ఒక క్రిస్టియన్ అమ్మాయికి మధ్య నడిచే హాస్య ప్రేమకథ. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు.
ప్లస్ పాయింట్స్
నాని నటన..
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్..
కథ
పాటలు
సినిమా నిడివి
చివరి మాట : ‘అంటే సుందరానికీ ‘గొంగళి పురుగుగా మారని సీతాకోక చిలుక’
రేటింగ్ : 2.5/5
కథ | : | 2/5 |
స్క్రీన్ ప్లే | : | 2.5/5 |
దర్శకత్వం | : | 2.5/5 |
సంగీతం | : | 2.5/5 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Nani, Nazriya nazim, Tollywood