హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki 2 Days Collections: సుందరం వసూళ్లు ఎలా ఉన్నాయంటే!

Ante Sundaraniki 2 Days Collections: సుందరం వసూళ్లు ఎలా ఉన్నాయంటే!

Photo Twitter

Photo Twitter

Ante Sundaraniki Collections: జూన్ 10న నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికీ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటిరోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్‌లో పెద్దగా డ్రాప్ కనిపించలేదు.

ఇంకా చదవండి ...

నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. చిత్రంలో నాని సరసన నజ్రియా నజీం (Nazriya Nazim) హీరోయిన్‌గా నటించగా.. నదియా, హర్ష వర్ధన్, రోషిని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నేడు (జూన్ 10) ఈ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటిరోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్‌లో పెద్దగా డ్రాప్ కనిపించలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సుందరం వసూళ్లు చూస్తే..

Day 1: 3.87Cr

Day 2: 3.48Cr

AP-TG టోటల్: 7.35CR నెట్(12.40CR~ గ్రాస్) వసూలైనట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

రెండో రోజు ఏరియా వైజ్ డీటెయిల్ రిపోర్ట్

Nizam: 1.54Cr

Ceeded: 37L

UA: 38L

East: 30L

West: 22L

Guntur: 26L

Krishna: 23L

Nellore: 18L

రెండో రోజుకు గాను మొత్తం అన్ని ఏరియాల్లో కలిపి 3.48CR నెట్ (5.90CR~ గ్రాస్) వసూలయింది. ఇకపోతే ఈ రెండు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 10.60 కోట్ల నెట్, 18.50 కోట్ల గ్రాస్ వసూలైనట్లుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.

విడుదలకు ముందు అంటే సుందరానికీ మొత్తం 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 31 కోట్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇంకా 20.40 కోట్ల రూపాయలు వస్తే లాభాల బాటలోకి వచ్చేస్తుంది.

సినిమా విడుదలకు ముందు ఈ అంటే సుందరానికీ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసి వేదికపై ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా నాని వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ అంటే సుందరానికీ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, నాని ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. సో.. చూడాలి మరి ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎప్పుడొస్తుందనేది!.

First published:

Tags: Ante sundaraniki, Hero nani, Tollywood

ఉత్తమ కథలు