తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు పుట్టినరోజు డిసెంబర్ 18. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీని ఇచ్చాడు దిల్‌రాజు. ఈ పార్టీకి దాదాపు ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ వచ్చారు. అయితే కొందరు మాత్రం రాలేదు. వారిలో నందమూరి హీరోలు కూడా ఉన్నారు. వీరు కాకుండా దిల్‌రాజు 50వ పుట్టినరోజు పార్టీకి రాకుండా ఆయనతో క్లోజ్‌గా ఉండే ఇద్దరు హీరోలు కూడా రాలేదట. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కారు... ఒకరు నాని, మరొకరు శర్వానంద్. ఈ హీరోలిద్దరూ హైదరాబాద్‌కు ఎందుకు రాలేదు? అని ఆలోచన చాలా మందికే వచ్చింది. అయితే అందుకు కారణాలున్నాయట. నాని ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి గోవాలో వేకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడట. అలాగే మరో హీరో శర్వానంద్ ఏకంగా మహా సముద్రం షూటింగ్‌లో ఉన్నాడట. అయితే హైదరాబాద్‌లో పార్టీని పూర్తి చేసుకున్న దిల్‌రాజు భార్యతో కలిసి గోవా చేరుకున్నాడట. అక్కడ మరో బర్త్‌డే పార్టీని జరుపుకున్నారని, ఆ పార్టీలో నాని, శర్వానంద్ పాల్గొన్నారు. వీరితో పాటు సిద్ధార్థ్ కూడా పార్టీలో పాల్గొన్నాడట. నాని తన నెక్ట్స్ మూవీ శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌కు సిద్ధమవుతుంటే, శర్వానంద్, సిద్ధార్థ్ మహా సముద్రం షూటింగ్‌లో బిజీగా కానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Hero nani, Sharwanand, Tollywood Movie News