గత కొంత కాలంగా మన దేశంలో హాలీవుడ్ సినిమాలకు బాగానే గిరాకీ పెరిగింది. దీంతో హాలీవుడ్ దర్శక,నిర్మాతలు ఇక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని హిందీతో పాటు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా హాలీవుడ్‌లో వచ్చిన ‘అవెంజర్స్’ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. తాజాగా అదే రూట్లో ‘ది లయన్ కింగ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేషన్‌గా వచ్చిన డిస్నీ కామిక్..అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతూ..మనలాగే ప్రవర్తిస్తాయి. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి. కలిసి మెలిసి బతుకుతాయి. వీటికి ఓ రాజు, ఓ రాణి, ఓ యువరాజు ఉంటారు. అంతేకాదు జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అయితే ఇదంతా డిస్నీ తయారు చేసిన ఓ కల్పిత కథ. దీని పేరే 'ది లయన్ కింగ్'.ఈ లయన్ కింగ్ సినిమాలో హీరో 'సింబ'. చిన్నప్పుడే సింబ ఓ యాక్సిడెంట్ కారణంగా.. కుటుంబం నుండి పారిపోతాడు. తన కుంటుంబానికి దూరంగా.. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పందితో కలిసి జీవిస్తూ ఉంటాడు.
అయితే కొన్ని యేళ్ల తర్వాత తన గతం గుర్తుకురావడం..తర్వాత తన రాజ్యాన్ని ఎలా తిరిగి దక్కించుకున్నాడనేది కథ. అయితే 1990లో ఈ సినిమాను 2డి యానిమేటెడ్ సినిమాగా విడుదల చేశారు. ఈ సినిమాను కూడా జంగిల్ బుక్ సినిమాను తెరకెక్కించన జాన్ ఫెరో ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.
మరోసారి..ఆధునిక సాంకేతిక సహాయంతో 3డిలో వచ్చే నెల జూలై 19న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలోని ముఫాసా (సింబా తండ్రి) క్యారెక్టర్‌కు షారుక్ డబ్బింగ్ చెప్పగా..ఈ సినిమాకు హీరో సింబా క్యారెక్టర్‌కు షారుక్ తనయుుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. తెలుగులో ముసాఫాకు పి.రవిశంకర్ డబ్బింగ్ చెబుతుండా..స్కార్ అనే మరో సింహానికి జగపతిబాబు డబ్బింగ్ చెబుతున్నాడు. తాజాగాా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అయిన సింబా పాత్రకు నాని చెబుతున్నాడు. ఈ విషయాన్నినాని అఫీషియల్‌గా ప్రకటించాడు.
This year
You have seen me as a father
And now
You are going to see me as a son
This July
I have a new name
SIMBA 🦁 pic.twitter.com/MOpIkaUxMl
— Nani (@NameisNani) June 29, 2019
ఈ సినిమాలో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు ఆలీ డబ్బింగ్ చెప్పారు. తమిళంలో హీరో సిద్ధార్ధ్..సింబాకు డబ్బింగ్ చెబుతున్నాడు. మొత్తానికి పెద్ద స్టార్స్ గొంతుతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Brahmanandam, Jagapati Babu, Nani, Shah Rukh Khan, Telugu Cinema, The Lion King, Tollywood