హోమ్ /వార్తలు /సినిమా /

‘టక్ జగదీష్’గా నాని.. కొత్త అవతారంలో నాచురల్ స్టార్..

‘టక్ జగదీష్’గా నాని.. కొత్త అవతారంలో నాచురల్ స్టార్..

‘టక్ జగదీష్’గా నాని (Twitter/Photo)

‘టక్ జగదీష్’గా నాని (Twitter/Photo)

ఈ యేడాది నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసాడు.

ఇంకా చదవండి ...

  ఈ యేడాది నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ప్రస్తుతం నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ఖరారు చేసారు.

  nani again team up with shiva nirvana and title as tuck jagadish,tuck jagadish,nani tuck jagadish,nani,shiva nirvana,nani shiva nirvana tuck jagadish,ninnu kori,jersey,gang leader,nani twitter,nani instagram,nani facebook,nani sri reddy,nani indraganti mohana krishna v,nani v movei,tollywood,telugu cinema,నాని,శివ నిర్వాణ,శివ నిర్వాణ నాని,నాని నిన్ను కోరి,నిన్నుకోరి నాని,నాని జెర్సీ,శివ నిర్వాన దర్శకత్వంలో కొత్త సినిమాకు ఓకే చెప్పిన నాని,టక్ జగదీష్,నాని టక్ జగదీష్
  ‘టక్ జగదీష్’గా నాని (Twitter/Photo)

  ‘టక్ జగదీష్’ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో నాని టక్ చేసుకొని వెనకాల ఉన్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నాని.. టక్ చేసుకొని తిరిగే సేల్స్ మేన్ క్యారెక్టర్ చేస్తున్నాడా అనేది చూడాలి.  ఈ సినిమాను ‘మజిలీ’ సినిమాను నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nani, Shiva Nirvana, Telugu Cinema, Tollywood, Tuck Jagadish

  ఉత్తమ కథలు