హిట్టిచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే చేసిన నాని..

ఈ యేడాది నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు.

news18-telugu
Updated: November 29, 2019, 11:42 AM IST
హిట్టిచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే చేసిన నాని..
నాని, శివ నిర్వాణ (File Photos)
  • Share this:
ఈ యేడాది నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ప్రస్తుతం నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో మరో రొమాంటిక్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ‘మజిలీ’ తర్వాత శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ‘మజిలీ’ సినిమాను నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 29, 2019, 11:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading