రామ్ చరణ్, నాని ఓ సినిమా కథ.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో చేస్తూ ఉంటారు. కొంత మందికి కథ నచ్చక ఈ సినిమా చేయలేకపోతే.. మరొకరు అది తమ ఇమేజ్ సూట్ కాదని రిజెక్ట్ చేసే వారుంటారు. అలా రామ్ చరణ్ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి మంచి మార్కులే కొట్టేశాడు.

news18-telugu
Updated: January 30, 2020, 9:58 AM IST
రామ్ చరణ్, నాని ఓ సినిమా కథ.. ఇంతకీ ఏం జరిగిందంటే..
రామ్ చరణ్,నాని (File Photos)
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో చేస్తూ ఉంటారు. కొంత మందికి కథ నచ్చక ఈ సినిమా చేయలేకపోతే.. మరొకరు అది తమ ఇమేజ్ సూట్ కాదని రిజెక్ట్ చేసే వారుంటారు. అలా రామ్ చరణ్ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి మంచి మార్కులే కొట్టేశాడు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఇంతకీ సినిమా ఏమిటంటే.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’.  గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా రామ్ చరణ్‌ను హీరోగా అనుకున్నారు. ఇక గౌతమ్ మీనన్ చెప్పిన కథకు చెర్రీ కూడా ఓకె చెప్పాడు. తీరా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే సమయానికి చరణ్.. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. దీంతో ఈ సినిమాను కొంత కాలం ఆగి చేద్దామన్నాడు. కానీ గౌతమ్ మీనన్ మాత్రం ఈ కథను ఎట్టి పరిస్థితుల్లో తెరకెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

nani acted ram charan rejected gautham menon eto vellipoyindi manasu movie,ram charan,nani,rrr,rrr ram charan,ram charan nani,nani twitter,ram charan instagram,ram charan facebook,nani instagram,nani facebook,ram charan twitter,ram charan nani gautam menon eto vellipoyindi manasu movie,eto vellipoyindi manasu,tollywood,telugu cinema,రామ్ చరణ్,నాని,రామ్ చరణ్ నాని,రామ్  చరణ్ నాని ఎటో వెళ్లిపోయింది మనసు,ఎటో వెళ్లిపోయింది మనసు,గౌతమ్ మీనన్ రామ్ చరణ్ నాని,ఆర్ఆర్ఆర్
‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో నాని, సమంత (Twitter/Photo)


అందుకే వెంటనే నానిని సంప్రదించి ఈ సినిమాలో హీరోగా తీసుకున్నాడు. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో నటనకు సమంత కూడా ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకోవడం విశేషం. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘గుణ’ చిత్రంలోని ఇళయరాజా స్వరాలు సమకూర్చని ‘ప్రియతమా నీవచట కుశలమా’ అని పాటను ఇళయరాజా ఈ సినిమా కోసం వాడుకోవడం విశేషం. ఇక నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన తర్వాతే కానీ నాని దగ్గరకు రాలేదు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 30, 2020, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading