హోమ్ /వార్తలు /సినిమా /

Nani 30 : లాంఛనంగా నాని 30 ప్రారంభం.. చిరంజీవి హాజరు.. పిక్స్ వైరల్..

Nani 30 : లాంఛనంగా నాని 30 ప్రారంభం.. చిరంజీవి హాజరు.. పిక్స్ వైరల్..

Nani 30 Photo : Twitter

Nani 30 Photo : Twitter

Nani 30 : నాచురల్ స్టార్ నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా అలా ఉండగానే నాని మరో సినిమాను ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nani 30:  నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ మూవీ ఆ మధ్య విడుదలై ఓకే అనిపించుకున్న సంగతి తెలిసిందే. కంటెంట్ బాగున్న ఎందుకో పెద్దగా కనెక్ట్ కాలేదు జనాలకు. దీంతో కలెక్షన్స్ అనుకున్న రేంజ్‌లో రాలేదు. ఇక  గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )‌తో మంచి సక్సెస్ అందుకున్నారు నాని. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై పరవాలేదనిపించాయి.  ఇక లేటెస్ట్‌గా నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ (Nani Keerthy Suresh Dasara  ) అనే ఓ మాస్ యాక్షన్  సినిమాను చేస్తోన్నసంగతి తెలిసిందే . కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించనుంది. సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

దసరా విడుదలకు రెడీ అవుతుండడంతో నాని కొత్త సినిమాను ప్రారంభించారు. నాని కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యవ్ డైరెక్ట్ చేయనున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ థాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇక ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర ప్రారంభానికి మెగాస్టార్ చిరంజీవి హాజరైయ్యారు. చిరంజీవితో పాటు రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా హాజరై టీమ్ ఆల్ దిబెస్ట్ చెప్పారు. ఈ చిత్రానికి మలయాళీ సంగీత దర్శకుడు హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్‌పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఇక నాని దసరా విషయానికి వస్తే.. విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ టీజర్‌ను (Dasara Teaser ) విడుదల చేసింది. తెలుగు టీజర్‌ను రాజమౌళి రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం మామూలుగా లేదని అంటున్నారు నెటిజన్స్. ఊరమాస్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్‌లో తెలుగు టీజర్‌ ఇప్పటికే 5 మిలియన్ పైగా వ్యూస్‌‌తో అదరగొడుతోంది.  నాని యాక్టింగ్, కెమెరా వర్క్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఇరగదీశాడని.. సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ టీజర్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే.. అన్ని భాషల్లోను అదిరింది రెస్పాన్స్. ముఖ్యంగా నాని మాస్ స్టైల్ యాక్షన్ సీన్స్, రస్టిక్ విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం నాని మేకోవర్ అదిరిందని.. కొత్త దర్శకుడు ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం బాగుందన్నారు. ముఖ్యంగా టీజర్‌లో లాస్ట్ షాట్ తోప్ అంటూ.. దర్శకుడికి ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ అంటూ ట్వీట్ చేశారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక మరోవైపు ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ నాని కెరీర్‌లోని హైయ్యెస్ట్ అని అంటున్నారు. ఓ రేంజ్‌లో సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్టుగా ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో పాటు టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో వస్తాయి.. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ విషయంలో కేకపెట్టిస్తుంది అని ట్రేడ్ వర్గాల టాక్. చూడాలి మరి ఎం జరుగుతుందో..

ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా  రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకు రెడీ అవుతోంది.

First published:

Tags: Mrunal Thakur, Nani, Tollywood news

ఉత్తమ కథలు