NANI 28TH MOVIE TITLE ANTE SUNDARANIKI OFFICIALLY ANNOUNCED FANS GET EXCITED TA
Nani 28th Movie: నాని 28వ సినిమాకు క్రేజీ టైటిల్.. మరోసారి ఆ మ్యాజిక్ రిపీటవుతుందా..
నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)
Nani 28th Movie Ante Sundaraniki : ఈ యేడాది నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో పలకరించాడు. తాజాగా నాని దీపావళి సందర్భంగా అనౌన్స్ చేసిన కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో పాటు పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసాడు.
Nani 28th Movie Ante Sundaraniki : ఈ యేడాది నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో పలకరించాడు. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డ.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. మొత్తంగా నాని లాండ్ మార్క్ 25వ సినిమా థియేటర్స్‌లో కాకుండా కరోనా కారణంగా ఓటీటీలో విడుదల అవడంపై నాని అభిమానులు కాస్తంత నిరాశ పడ్డారు. ఏమైనా థియేటర్ మార్కెట్ ఉన్న నాని .. ఇలా తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ధించుకోలేకపోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... తాజాగా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో నాని పాల్గొంటున్నాడు. మరోవైపు నాని.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.
నాని ‘అంటే సుందరానికీ’ (Twitter/Photo)
ఈ టైటిల్ పోస్టర్లో నాని వెనకాల తిరిగి పంచె కట్టులో పల్లెటూరు యువకుడి పాత్రలో నటించబోతున్నట్టు కనబడుతోంది. అంతేకాదు పల్లెటూరులో ఏదో గీతాలు పాడుకునే వ్యక్తి విదేశాల్లో రాక్ స్టార్‌గా ఎలా అలరించడనేదే ఈ సినిమా స్టోరీ అన్నట్టు కనబడుతోంది. పోస్టర్లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించి 2021లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.