హోమ్ /వార్తలు /సినిమా /

Nani 28th Movie: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నాని 28వ సినిమాకు ముహూర్తం ఖరారు..

Nani 28th Movie: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నాని 28వ సినిమాకు ముహూర్తం ఖరారు..

న్యాచురల్ స్టార్ నాని (natural star nani)

న్యాచురల్ స్టార్ నాని (natural star nani)

Nani 28th Movie: ఈ యేడాది  నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో పలకరించాడు. ఈ శుక్రవారం నాని.. తన 28వ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించనున్నాడు.

  Nani 28th Movie: ఈ యేడాది  నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో పలకరించాడు. ఈ సినిమాలో నాని నటనకు మంచి మార్కులే పడ్డ.. రొటీన్ రివేంజ్ స్టోరీ అంటూ కామెంట్స్ వినపడ్డాయి. ఈ చిత్రంలో మరో హీరోగా సుధీర్ బాబు నటించాడు. మొత్తంగా నాని లాండ్ మార్క్ 25వ సినిమా థియేటర్స్‌లో కాకుండా కరోనా కారణంగా ఓటీటీలో విడుదల కావడం విశేషం. ఏమైనా థియేటర్ మార్కెట్ ఉన్న నాని .. ఇలా తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ధించుకోలేకపోతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... తాజాగా నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ  సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనల అనుగుణంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్‌లో నాని పాల్గొంటున్నాడు. మరోవైపు నాని.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు.


  ఈ చిత్రాన్ని 1970-80ల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు ఈ సినిమా పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. మరోవైపు నాని ఈ శుక్రవారం ‘ష్.. ఎవరికీ చెప్పొద్దు’ రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చసారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో 28వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుందనే విషయాన్ని రివీల్ చేయలేదు. ఏమైనా దీపావళి కానుకగా నాని.. తన అభిమానులకు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌తో పండగ గిప్ట్ ఇవ్వనున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Mythri Movie Makers, Nani, Tollywood

  ఉత్తమ కథలు