Nandita Swetha: ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో విషాదం..

నందితా శ్వేత (File/Photo)

Nandita Swetha: గత కొన్నేళ్లుగా చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

  • Share this:
    Nandita Swetha: గత కొన్నేళ్లుగా చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యేడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమ అనే తేడా లేకండా  భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు.అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతో పాటు నిన్నటి నిన్న ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతితో పాటు మలయాళ నటుడు రిజాబావా కూడా అనారోగ్యంతో కన్నుమూసారు.

    తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి శివ స్వామి ఆదివారం కన్నుమూసినట్టు తెలిపారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేసారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    నందిత శ్వేత విషయానికొస్తే..  ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది బ్యూటీ. ఆ సినిమా విజయం సాధించినా కూడా కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు. దాంతో హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది ఈ బ్యూటీ.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. అందాల గేట్లు తెంచేసి రచ్చ చేస్తుంది. తాజాగా ఈమె తండ్రి కాలం చేయడంతో ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం శ్వేత నందిత పలు తమిళంతో పాటు కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: