Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ కార్తీకదీపం తర్వాత రేటింగ్ లో రెండవ స్థానంలో ఉంది. ఇక ఇందులో కుటుంబం కోసం ఎన్నో ఎదురు తంటాలు పడుతూ.. భర్త కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఓ గృహ లక్ష్మి తులసి.ఇక తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఈ సీరియల్ బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది.
ఇక తన మెడిసన్ కోసం సహాయం చేసినందుకు తులసికి థాంక్స్ చెబుతుంది దివ్య. ఇక ఈ విషయాన్ని బయటకు చెప్పద్దు అంటూ తులసి తనతో అంటుంది. ఇక అభి ఇంటర్వ్యూ కి వెళ్తున్న సమయంలో అంకిత అడ్డుపడుతుంది. దాంతో అక్కడ గొడవ క్రియేట్ అవుతుండడంతో.. తనని కొట్టడానికి చేయి లేపుతాడు అభి. వెంటనే అంకిత తల్లి, తండ్రి అక్కడికి రావడంతో ఎత్తిన చేతిని దింపుతూ తన మామ గారిని కూడా మీరు అత్త చేతిలో కీలుబొమ్మ అంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక తులసికి లాస్య ఫోన్ చేయగా వారిద్దరి మధ్య కాస్త ఎదురెదురు మాటలు సాగుతాయి. ఇక దివ్య సంతోషాన్ని చూసి నందు కూడా తులసితో నవ్వుతూ మాట్లాడతాడు. ఇదిలా ఉంటే తర్వాత ఎపిసోడ్ లో మాధవి ఉరి పెట్టుకునే దృశ్యం కనిపిస్తుంది.
ఇక అది నందు అద్దం లోనుంచి చూస్తూ తలుపులు పగలగొట్టి మరి తనని కాపాడుతాడు. ఏం జరిగింది అంటూ గట్టిగా అడుగుతాడు. దీంతో తన భర్త నుంచి విడాకులు ఇస్తానంటున్నాడని ఆ మాటతో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. నిజానికి మాధవి తన భర్త మోహన్ ఎంతో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ కూడా ఈ సీరియల్లో అలాగే చూపించారు. అలాంటిది విడాకులు తీసుకోవడానికి ఎందుకు అలా సిద్ధమయ్యాడని ఆశ్చర్యపోతారు కుటుంబ సభ్యులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Intinti gruhalakshmi serial, Lasya, Madhavi, Nandhu, Suicide attempt, Telugu serial, Thulasi, ఇంటింటి గృహలక్ష్మి, కార్తీకదీపం, స్టార్ మా