‘అడుగడుగో యాక్షన్ హీరో’.. ‘రూలర్’ గా బాలయ్య నట విశ్వరూపం..

Ruler | నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. తాజాగా ఈ సినిమా నుంచి అడుగడుగో యాక్షన్ హీరో వీడియో సాంగ్ రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: December 4, 2019, 10:50 AM IST
‘అడుగడుగో యాక్షన్ హీరో’.. ‘రూలర్’ గా బాలయ్య నట విశ్వరూపం..
‘రూలర్’లో బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూలర్’. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌కు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్‌ రోల్లో నటించబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గి చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.  ఈ  సందర్భంగా  చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వచ్చే నెల 14న  వైజాగ్‌లోని వుడా పార్క్‌లో  నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే అడుగడుగో యాక్షన్ హీరో లిరికల్ సాంగ్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ రిలీజ్ చేసారు.



ఈ సాంగ్‌లో బాలకృష్ణ మరోసారి స్టైలిష్‌ లుక్‌తో కట్టిపడేసాడు. అరవై  ఏళ్లు దగ్గరపడుతున్న తన హీరోయిజంతో, నటనతో, డైలాగులతో వెండితెరపై రికార్డులు సృష్టిస్తున్నాడు బాలయ్య.

nandamuril balakrishma ruler Adugadugo Action Hero video song released,ruler shooting comleted,ruler movie review,balakrishna ks ravikumar,balakrishna sonal chauhan,ruler teaser review,ruler teaser,ruler teaser released,ruler teaser talk,balakrishna ruler teaser talk,ruler new look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,రూలర్ టీజర్ రిలీజ్ టాక్,రూలర్ టీజర్,రూలర్ టీజర్,రూలర్ షూటింగ్ కంప్లీట్,రూలర్‌కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్
‘రూలర్’లో బాలకృష్ణ (Twitter/Photo)




‘రూలర్’ తర్వాత బాలకృష్ణ..బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అంతేకాదు ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...