HOME »NEWS »MOVIE »nandamuri mokshagna son of nandamuri balakrishna all set to debut with puri jagannadh directoion here are the details ta

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ.. ముహూర్తం ఖరారు..

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ.. ముహూర్తం ఖరారు..
మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ (Twitter/Photo)

Nandamuri Mokshagna | నందమూరి బాలకృష్ణ ఏకైక పుత్రరత్నం మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి నందమూరి కాంపౌండ్ వర్గాలు.

  • Share this:
    Nandamuri Mokshagna | నందమూరి బాలకృష్ణ ఏకైక పుత్రరత్నం మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఈ పాటికే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేవాడే. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి నందమూరి కాంపౌండ్ వర్గాలు. వివరాల్లోకి వెళితే.. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత ఇంత వరకు ఏ హీరో కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వలేదు. నందమూరి  ఫ్యామిలీ నుంచి హీరో వచ్చిన పదహారేళ్లు కావొస్తోంది. అదే చిరంజీవికి చెందిన మెగా ఫ్యామిలీ నుంచి డజను పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ మెగా వారసుల ఎంట్రీ కొనగుతూనే ఉంది. గతేడాది బాలయ్య తన 60వ పుట్టినరోజు సందర్భంగా పలు చానెల్స్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ సందర్భంగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆయన కోసం దర్శకులు కథలను కూడా రెడీ చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అప్పట్లో బాలయ్య పుట్టినరోజు వేడుకల్లో మోక్షజ్ఞ భారీ కాయాన్ని చూసి అభిమానులు కాస్తంత షాక్ తిన్నారు.

    తాజాగా నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ 2021లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఏడాదే మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తాన్ని బాలయ్య ఖరారు చేసినట్టు సమాచారం. అంతేకాదు బాలయ్య తన కుమారుడిని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాను బాలకృష్ణ 61వ పుట్టినరోజున ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలున్నాయి.



    మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్ (Mokshagna Puri Jagannadh)
    మోక్షజ్ఞ పూరీ జగన్నాథ్ (Mokshagna Puri Jagannadh)


    ఈ మ‌ధ్యే 23వ ఏట అడుగుపెట్టాడు మోక్షు. ఇండ‌స్ట్రీలో చాలామంది వార‌సులు ఇదే వ‌య‌సులోనే హీరోలుగా వ‌చ్చారు. చ‌ర‌ణ్ 21 ఏళ్ల‌కు "చిరుత‌".. అఖిల్ 20 ఏళ్ల‌కే "అఖిల్".. ఎన్టీఆర్ అయితే 16 ఏళ్ల‌కే "నిన్ను చూడాల‌ని".. మ‌హేశ్, ప‌వ‌న్ 25 ఏళ్ల‌కు.. బ‌న్నీ 20 ఏళ్ల‌కు "గంగోత్రి".. ప్ర‌భాస్ 22 ఏళ్ల‌కు "ఈశ్వ‌ర్".. ఇలా ప్ర‌తీ హీరో చాలా త‌క్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చారు.

    nandamuri mokshagna Teja, nandamuri mokshagna teja latest photos, nandamuri mokshagna teja age, nandamuri mokshagna teja instagram, nandamuri mokshagna teja twitter, nandamuri mokshagna teja date of birth, nandamuri mokshagna teja facebook, nandamuri mokshagna teja photos, నందమూరి బాలకృష్ణ, నందమూరి మోక్షజ్ఞ తేజ, నందమూరి మోక్షజ్ఞ తేజ ఫొటోలు,
    నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ 2021లో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది అభిమానులకు ఫుల్ హ్యాపీ న్యూస్ చెప్పాడు. (Image; Twitter)


    ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ న‌ట‌న‌తో పాటు డాన్సులు.. ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు. బాల‌య్య డాన్సుల్లో కింగ్.. అలాంటి హీరో వార‌సుడు అంటే అభిమానులు ఊహించేది డాన్సులు. అందుకే ఈ విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ వార‌సుడు.మొత్తంగా మోక్షు ఎంట్రీ  మూవీని పూరీ జగన్నాథ్ ప్యాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తం ఈ విషయమై బాలయ్య క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 23, 2021, 11:42 IST

    टॉप स्टोरीज