బాలయ్య అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్..

మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తిగా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

news18-telugu
Updated: June 9, 2019, 7:58 PM IST
బాలయ్య అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్..
నందమూరి బాలకృష్ణ (File)
news18-telugu
Updated: June 9, 2019, 7:58 PM IST
నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇది కచ్చితంగా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. నందమూరి వంశంలో మూడోతరం హీరోగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడా?ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్. నందమూరి మోక్షజ్ఞ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ఆఫ్ ద న్యూస్‌గా మారిపోయింది. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? అంటూ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలయ్య స్వయంగా మెగా ఫోన్ పట్టి కొడుకుని తెరంగేట్రం చేస్తారనే చర్చ కూడా జరిగింది. నటనలో మెళకువల కోసం మోక్షజ్ఞకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని.. అందుకే అతడి ఎంట్రీ ఆలస్యం అవుతోందనే ప్రచారం ఇన్నాళ్లూ జరిగింది. అయితే, ఇప్పుడు అసలు మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తిగా ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Balakrishna opens about Nandamuri Mokshagna Entry and says His 1st movie will very soon pk.. బాల‌య్య ప్ర‌స్తుతం మ‌హానాయ‌కుడు సినిమా ప్ర‌మోష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. అది పూర్తైన త‌ర్వాత బోయ‌పాటి సినిమాతో బిజీ కానున్న‌ట్లు చెప్పాడు. దానికి ముందు ఎన్నిక‌ల‌తో బిజీ కానున్నాడు బాల‌య్య‌. ఇక మ‌హానాయకుడు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా కొడుకు ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు ఈ క‌థానాయ‌కుడు. mokshagna nandamuri,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ


నందమూరి బాలయ్య వందో సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలోనే బాలయ్య ఉంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లో చిన్నప్పటి బాలయ్యగా మోక్షజ్ఞ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అవన్నీ నిజం కాదని, ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక తెలిసిపోయింది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను మోక్షజ్ఞను ఓ కథా బలం ఉన్న సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నానని, పెద్ద పెద్ద ఫైటింగ్‌లు చేసేసి.. ప్రపంచాన్ని కాపాడే హీరో రేంజ్‌లో తెరంగేట్రం చేయబోనని ప్రకటించారు. అంటే, బాలయ్య మదిలో మోక్షజ్ఞను హీరోగా చేయాలనే తపన మాత్రం ఉన్నట్టు అర్థం అవుతోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 24 ఏళ్లు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...