హోమ్ /వార్తలు /సినిమా /

కళ్యాణ్ రామ్ ఏంటి ఇలా అయిపోయాడు.. బాబోయ్..?

కళ్యాణ్ రామ్ ఏంటి ఇలా అయిపోయాడు.. బాబోయ్..?

కళ్యాణ్ రామ్ న్యూ లుక్ (Kalyan Ram/ Pic Credits: Kamleshnand)

కళ్యాణ్ రామ్ న్యూ లుక్ (Kalyan Ram/ Pic Credits: Kamleshnand)

Kalyan Ram: మొన్న సంక్రాంతికి ఈయన నటించిన ఎంత మంచివాడవురా సినిమా డిజాస్టర్ అయింది. సతీష్ వేగేశ్న మంచి సినిమా ఇస్తాడనుకుంటే.. మరోసారి అదే రొటీన్ సినిమా ఇచ్చాడు. దాంతో మరో ఫ్లాప్ తప్పలేదు ఈ హీరోకు.

ఇక్కడ కనిపిస్తున్నది ఎవరో కాదు.. నందమూరి కళ్యాణ్ రామ్. బాపురే ఏంటి ఇలా అయిపోయాడు అని ఆశ్చర్యపోతున్నారు కదా. కొత్త సినిమా కోసం ఈయన పడుతున్న కష్టాలివి. మొన్న సంక్రాంతికి ఈయన నటించిన ఎంత మంచివాడవురా సినిమా డిజాస్టర్ అయింది. సతీష్ వేగేశ్న మంచి సినిమా ఇస్తాడనుకుంటే.. మరోసారి అదే రొటీన్ సినిమా ఇచ్చాడు. దాంతో మరో ఫ్లాప్ తప్పలేదు ఈ హీరోకు. ఇప్పటి వరకు ఈయన తర్వాత సినిమా ఏంటనేది ఇంకా చెప్పలేదు. అయితే ఈయన మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో ఓ పీరియాడికల్ సినిమా చేయబోతున్నాడు. దీనికి రావణ్ అనే టైటిల్ కూడా పెట్టారని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే ఇప్పుడు బాడీ బిల్డప్ చేయడంతో పాటు లుక్ కూడా మార్చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్ న్యూ లుక్ (Kalyan Ram)
కళ్యాణ్ రామ్ న్యూ లుక్ (Kalyan Ram)

తాజాగా బయటికి వచ్చిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 13వ శతాబ్దపు కథతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో భారీగా సిజీ వర్క్ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అపోలో లైఫ్ స్టూడియో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. గుబురు గడ్డం.. జుట్టు.. మీసాలతో కళ్యాణ్ రామ్ చాలా కొత్తగా కనిపించాడు.

కళ్యాణ్ రామ్‌తో జూ ఎన్టీఆర్ (Twitter/Photo)
కళ్యాణ్ రామ్‌తో జూ ఎన్టీఆర్ (Twitter/Photo)

కొత్త సినిమా కోసమే కళ్యాణ్ రామ్ లుక్ ఇలా మారిపోయాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌లోనే నిర్మించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాను కూడా తన సొంత బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. మొత్తానికి తమ్ముడితో పాటు తను కూడా భారీ సినిమాతోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్.

First published:

Tags: Kalyan Ram Nandamuri, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు