జూనియర్ ఎన్టీఆర్‌పై కల్యాణ్‌రామ్ కీలక వ్యాఖ్యలు..

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. వీరిద్దరు నందమూరి వారసులు. పైగా సోదరులు. తాత నందమూరి తారక రామారావుకు తగ్గ మనవళ్లు.

news18-telugu
Updated: January 16, 2020, 8:55 AM IST
జూనియర్ ఎన్టీఆర్‌పై కల్యాణ్‌రామ్ కీలక వ్యాఖ్యలు..
కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. వీరిద్దరు నందమూరి వారసులు. పైగా సోదరులు. తాత నందమూరి తారక రామారావుకు తగ్గ మనవళ్లు. నందమూరి హరికృష్ణ రక్తం పంచుకొని పుట్టిన వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం. వీరి సోదర ప్రేమ చాలా గొప్పది. సినిమాల పరంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా వీరిద్దరు అన్ని విషయాల్లో చర్చించుకుంటారు. అయితే.. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్‌పై కల్యాణ్‌రామ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంత మంచివాడవురా సినిమా రిలీజ్ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న కల్యాణ్‌రామ్.. తన తమ్ముడి గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. తారక్‌ను నాన్నా అని పిలుస్తానని, తమ్ముడు అని ఎప్పుడూ పిలవనని వ్యాఖ్యానించాడు. తారక్ తనతో కొన్ని సార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడని, కొన్ని సార్లు చిన్న పిల్లాడిగా మారిపోతాడని చెప్పాడు.

నాన్నంటే తనకు చాలా ఇష్టమని, ఆయన లేని లోటును తారక్ తీర్చుతున్నాడని వెల్లడించాడు. ఒకరికి ఒకరం అండగా ఉంటామని కల్యాణ్‌రామ్ తెలిపాడు. నాన్నకు తారక్, తాను కలిసి ఒక సినిమా చేయాలని ఉండేదని.. భవిష్యత్తులో తారక్‌తో మరిన్నిసినిమాలు తీస్తానని అన్నాడు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>