Home /News /movies /

NANDAMURI KALYAN RAM IS DOING AN EXPERIMENTAL MOVIE DOES IT WORK OUT MHN

Nandamuri Kalyan Ram: ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్న నంద‌మూరి హీరో... వ‌ర్క‌వుట్ అవుతుందా?

Nandamuri Kalyan Ram is doing an experimental movie does it work out

Nandamuri Kalyan Ram is doing an experimental movie does it work out

Nandamuri Kalyan Ram: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో ఓ ఎక్స్‌పెరిమెంట్ మూవీ చేయబోతున్నాడట. ఇంతకీ ఆ మూవీ జోనర్ ఏంటో తెలుసా..

    నంద‌మూరి హీరోల్లో జ‌యాప‌జ‌యాల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌. ఈయ‌న హీరోనే కాదు.. మంచి నిర్మాత కూడా. ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా, మ‌రో వైపు నిర్మాత‌గా ఫుల్ బిజీగా ఉంటున్న క‌ల్యాణ్‌రామ్ ఇప్పుడు మ‌రో ఎక్స్‌పెరిమెంట్ చేయ‌బోతున్నాడ‌నే సంగ‌తి తెలుసా? ఇంత‌కీ క‌ల్యాణ్ రామ్ ఎలాంటి సాహ‌సం చేస్తున్నాడు? అనే సందేహం రాక మాన‌దు. వివ‌రాల్లోకి వెళితే.. క‌ల్యాణ్‌రామ్ ఓ పీరియ‌డ్ డ్రామాలో న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు పీరియాడిక్ మూవీలో న‌టించే అవ‌కాశ‌మే రాలేదు. అలాంటి అవ‌కాశం ఎదురుచూస్తున్న క‌ల్యాణ్ రామ్‌.. అవ‌కాశం వ‌స్తే ఊరుకుంటాడా? వెంట‌నే ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండా ఓకే చెప్పేశాడు.

    మ‌రి క‌ల్యాణ్‌రామ్‌తో పీరియాడిక్ డ్రామా చేయ‌బోయే ద‌ర్శ‌కుడెవ‌రో తెలుసా? న‌వీన్ మేడారం. ఇది వ‌ర‌కు.. అవ‌స‌రాల శ్రీనివాస్‌తో బాబుబాగా బిజీ అనే అడ‌ల్డ్ కామెడీ మూవీ చేసిన ద‌ర్శ‌కుడు. ఇప్పుడు డిఫ‌రెంట్ మూవీ చేయ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, న‌వీన్ మేడారం ఈసారి..స్పై థ్రిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఏజెంట్ వినోద్ పేరుతో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. ఈ సినిమా 1940 బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

    ఒక‌వైపు వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా సినిమా చేస్తున్న క‌ల్యాణ్ రామ్.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
    Published by:Anil
    First published:

    Tags: Kalyan Ram Nandamuri, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు