Home /News /movies /

Young Tiger Ntr - Kalyan Ram: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాటలోనే నందమూరి కల్యాణ్‌రామ్

Young Tiger Ntr - Kalyan Ram: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాటలోనే నందమూరి కల్యాణ్‌రామ్

Nandamuri Kalyan Ram following Tarak footsteps

Nandamuri Kalyan Ram following Tarak footsteps

Young Tiger Ntr - Kalyan Ram: నందమూరి మూడో తరం నట వారసుల్లో ఒకరైన నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ హీరో తన సోదరుడు ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

    సాధారణంగా మన కంటే పెద్ద వారి బాటలో మనం నడుస్తాం. కానీ చిన్నవారి బాటలోకి పెద్దవారు అడుగు పెడితే పరిస్థితి రివర్స్ అయినట్లే. ఇప్పుడు టాలీవుడ్‌లో మాత్రం రివర్స్‌ జరుగుతుందట. ఇంతకీ అంత రివర్స్‌ పనిచేసేదెవరా? అని ఆలోచించకండి. ఆ హీరో ఎవరో కాదు.. నందమూరి మూడో తరం నట వారసుల్లో ఒకరైన నందమూరి కల్యాణ్‌రామ్‌. ఈ హీరో తన సోదరుడు ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కల్యాణ్‌రామ్‌ ఎందులో ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నాడబ్బా అని చూస్తే.. సినీ వర్గాల కథనం మేరకు కల్యాణ్‌రామ్‌ రీసెంట్‌గా ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు. అది కూడా భారీ చిత్రాలను నిర్మించే అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌తో. ఈ సంస్థ భారీ చిత్రాలతో పాటు అప్పుడప్పుడు మీడియం బడ్జెట్‌ సినిమాలను నిర్మిస్తుంటుంది. ఇలా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న మీడియం బడ్జెట్‌ మూవీలో నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించబోతున్నాడట.

    రాజేంద్ర అనే డెబ్యూ డైరెక్టర్‌ ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా కథను సిద్ధం చేశాడట. కథ నచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌ నందమూరి కల్యాణ్‌రామ్‌ అయితే బావుంటుందని ఆయన్ని అప్రోచ్‌ అయ్యారట. ఆయన కథ వినగానే నచ్చడంతో ఓకే చెప్పేశాడట. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, చిరంజీవి వంటి స్టార్స్ తర్వాత నేటి తరంలో త్రిపాత్రాభినయం చేసిన స్టార్‌ తారక్‌ మాత్రమే. మూడు పాత్రలు చేయాలనే తలంపుతో కాకుండా మంచి కథ కుదరాలి. అలా కుదరడంతో ఎన్టీఆర్‌ జై లవకుశ సినిమాలో నటించాడు. కాస్త గ్యాప్‌ తర్వాత కల్యాణ్‌రామ్‌ ఇప్పుడు త్రిపాత్రాభినయం చేయబోతున్నాడని టాక్‌.

    అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే నెలలోనే కల్యాణ్‌ రామ్‌ ఈ కొత్త సినిమాను లాంఛనంగా స్టార్ట్‌ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో జైలవకుశలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేశాడు. మూడేళ్ల తర్వాత అన్నకల్యాణ్ రామ్‌ తమ్ముడు తారక్‌ను ఫాలో అవుతున్నాడు. మూడు పాత్రలను చేయడమంటే సులభమైన విషయం కాదు. పాత్రల సంభాషణల పరంగా వేరియేషన్‌ చూపిస్తూనే లుక్స్‌ పరంగా వేరియషన్‌ చూపించాలి. మరి కల్యాణ్‌రామ్‌ ఈ సినిమా కోసం ఎలా మేకోవర్‌ అవుతాడో చూడాలి.
    Published by:Anil
    First published:

    Tags: Jr ntr, Kalyan Ram Nandamuri

    తదుపరి వార్తలు