‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ లేడా..?

మహానటుడు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ..తన సొంత సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై నటించి నిర్మించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాలో బాలయ్య పాత్రను ఎవరు పోషించరనే విషయమై హాట్ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: January 4, 2019, 4:48 PM IST
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ లేడా..?
ఎన్టీఆర్ కథానాయకుడులో విభిన్న వేషాల్లో బాలకృప్ణ
  • Share this:
మహానటుడు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ..తన సొంత సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై నటించి నిర్మించిన సంగతి తెలిసిందే కదా. రామారావు జీవితాన్ని ఒక పార్ట్‌లో చూపించడం కష్టం కాబట్టి ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో రామారావు సినీ ప్రస్థానాన్ని ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. మరోవైపు రామారావు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్..మహానాయకుడు’గా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

రెండు భాగాలుగా ‘ఎన్టీఆర్’ బయోపిక్


ఈ సినిమాలో నందమూరి తారకరామారావు సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటించింది.
మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్..చంద్రబాబుగా రానా..శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్..సావిత్రిగా నిత్యామీనన్ నటించారు.

‘ఎన్టీఆర్’ కథానాయకుడులో బాలయ్య, రకుల్‌
ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ తనయుల్లో ఒకరైన చైతన్య రథ సారథి హరికృష్ణ పాత్రలో..ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసాడు. ఈ సినిమా విడుదలకు ముందు, హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్..‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాబాయి బాలకృష్ణ పాత్రపై వివరణ ఇచ్చాడు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్, హరికృష్ణ పాత్రల్లో బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ (ట్విట్టర్ ఫోటో)


ఈ బయోపిక్‌ను బాలయ్యను పాత్ర లేకుండానే ఈ సినిమాను తెరకెక్కించినట్టు మీడియాకు వెల్లడించారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు.

‘ఎన్టీఆర్’కథానాయకుడులో బాలకృష్ణ


ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో తండ్రి పాత్రను పోషిస్తోన్న బాలకృష్ణ..తన పాత్రను ఈ సినిమాలో లేకుండా తెరకెక్కించారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్టీఆర్ కథానాయకుడులో వివిధ వేషాల్లో బాలకృప్ణ


మరోవైపు కొంత మంది ఈ సినిమాలో బాలయ్య పాత్రను రివీల్ చేస్తే అనవసరంగా ఈ బయోపిక్‌పై లేనిపోని అంచనాలు పెరుగుతాయనే వాదన కూడా ఉంది. రిలీజ్ తర్వాతే వెండితెరపై బాలయ్య పాత్రను ఎవరు పోషించారనే విషయం బయటపడితే అపుడు ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశాలు లేకపోలేదని మరొకొంత మంది చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య పాత్రను ఆయన ముద్దుల తనయుడు మోక్షజ్ఞ పోషించినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

Krish Will be the launching director for Balakrishna Son Nandamuri Mokshagna.. ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. దాంతో అందరి చూపులు ఇప్పుడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞపై పడ్డాయి. mokshagna nandamuri,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ


ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్’ బయోపిక్‌తోనే కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసేలా బాలయ్య ప్లాన్ చేసినట్టు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య పాత్రపై క్లారిటీ రావాలంటే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

పైసావసూల్ బ్యూటీ ముస్కాన్ సేథీ హాట్ ఫోటోషూట్


ఇది కూడా చదవండి

బాల‌కృష్ణ‌పై మళ్లీ నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బ‌యోపిక్‌పై సెటైర్లు..

మెగాస్టార్ కుమ్ముడు మాములుగా లేదుగా..బాసు నువ్వు కెవ్వు కేక
First published: January 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు