Home /News /movies /

NANDAMURI KALYAN RAM BIMBISARA TRAILER TO BE OUT ON JULY 4 SB

Bimbisara: 'బింబిసార' ట్రైలర్‌కు ముహూర్తం ఖరారు.. ఇవాళ సాయంత్రమే రిలీజ్..!

బింబిసార ‘ట్రైలర్’ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

బింబిసార ‘ట్రైలర్’ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల బింబిసార విడుద‌ల తేదీను ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ట్రైల‌ర్‌ గ్లింప్స్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.

    నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. హిట్లు ప్లాప్స్‌ అనేవి పట్టించుకోకుండా తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటు పోతున్నాడు.
    క‌ళ్యాణ్ రామ్‌ చాలా కాలం త‌ర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గాను ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒక‌టి. ఈ సినిమాకు మ‌ల్లిడి వ‌శిష్ఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. అయితే తాజాగా బింబిసార ట్రైలర్ రిలీజ్ కానుంది. మరికొన్ని గంటల్లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు .

    ఈ రోజు సాయంత్రం 5:09 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా కేథరిన్ .. సంయుక్త మీనన్ కనిపించనున్నారు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా ఫాంటసీ యాక్ష‌న్ ఫిలిం నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.



    హీరోగా .. నిర్మాతగా కల్యాణ్ రామ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూనే, సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతవరకూ సోషల్ మూవీస్ చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈసారి చరిత్రలో ముడిపడిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'బింబిసార' ను ఎంచుకున్నాడు. ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ. సైన్స్ ను .. చరిత్రను కలుపుకుంటూ నడుస్తుంది. కథ ప్రకారం వర్తమానంలోనూ ... గతంలోను రెండు విభిన్నమైన పాత్రలలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. 'బింబిసార'గా ఆయన లుక్ ఇప్పటికే బయటికి వచ్చింది.

    ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల బింబిసార విడుద‌ల తేదీను ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ ట్రైల‌ర్‌ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ‘ఓ యుద్ధం మీద ప‌డితే ఎలా ఉంటుందో చూస్తారా’ అంటూ క‌ళ్యాణ్‌రామ్ డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. గ్లింప్స్‌లోని విజువ‌ల్స్, క‌ళ్యాణ్‌రామ్ లుక్స్ ట్రైల‌ర్‌పై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఎన్‌టీఆర్ అర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Bimbisara Movie, Kalyan ram, Kalyan Ram Nandamuri

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు