Home /News /movies /

NANDAMURI KALYAN RAM BIMBISARA NEETHO UNTE CHALU SONG RELEASE SLB

Bimbisara: నీతో ఉంటే చాలు.. కళ్యాణ్ రామ్ వీడియో వైరల్

Kalyan Ram/ Photo Twitter

Kalyan Ram/ Photo Twitter

రాజ్యాలు, రాజులు, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఓ అద్భుతమైన కథతో బింబిసార సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్ష‌న్ తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నీతో ఉంటే చాలు సాంగ్ రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
నటుడిగా, నిర్మాతగా తెలుగు తెరపై సత్తా చాటుతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అతనొక్కడే, పటాస్, 118 లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ హీరో.. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బింబిసార (Bimbisara) సినిమా కంప్లీట్ చేశారు. రాజ్యాలు, రాజులు, టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఓ అద్భుతమైన కథతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్ష‌న్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తూనే హీరోగా కూడా చేస్తున్న ఆయన.. ఈ మూవీతో బిగ్ సక్సెస్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా బింబిసార సినిమా నుంచి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కూడా నిర్వహించి తన తమ్ముడు ఎన్టీఆర్ తో సినిమాకు హైప్ తీసుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి నీతో ఉంటే చాలు అనే సాంగ్ రిలీజ్ చేశారు.

'నీతో ఉంటే చాలు' అంటూ సాగిపోతున్న ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ పాటలో చూపించిన విజువల్స్ ఆసక్తి రేకెత్తించాయి. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. విడుడల చేసిన కొద్ది సేపట్లోనే ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ దక్కింది. దీంతో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది ఈ సాంగ్.

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ బింబిసార సినిమాతో విశిష్ట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న (Bimbisara Release Date) ఈ సినిమా రిలీజ్ కానుంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు