Home /News /movies /

NANDAMURI KALYAN RAM BIMBISARA MOVIE VIJAYAHO FULL VIDEO SONG RELEASED TA

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ నుంచి ’విజయహో’ సాంగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ విజయహో సాంగ్ విడుదల (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ విజయహో సాంగ్ విడుదల (Twitter/Photo)

Bimbisara Pre Release Theatrical Business : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. తాజాగా ఈయన టైటిల్ రోల్ ప్లే చేస్తూ చేసిన సినిమా ‘బింబిసార’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి విజయహో పాటను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    Kalyan Ram As Bimbisara vijayaho Song  | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈయన  సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌కు అసలు  సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే  హీరోల్లో  క‌ల్యాణ్‌రామ్‌ (Kalyan Ram ) ఒకరు. ఇతను హీరోగానే  కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా  నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara) .  ఈ సినిమాను మరి కొన్ని గంటల్లో విడుదల కానుంది.  ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు.

    ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి విజయహో అనే పాటను విడుదల చేశారు.


    పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. తాజాగా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక  రన్ టైమ్ 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు.‘బింబిసార’ సినిమా చూసి సెన్సార్ వాళ్లు సినిమాను బాగా రిచ్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందని చెప్పుకొచ్చారు. మొత్తంగా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.



    ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ట్రైలర్‌‌తో పాటు లిరికల్ పాటలను విడుదల చేస్తే మంచి  మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  తాజాగా ఈ సినిమా  నుంచి  కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్  విడుదల చేశారు. ఇక ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి మాట్లాడిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా విడుదల చేసిన కొత్త ట్రైలర్‌లో హద్దులను చెరిపేస్తూ.. రాజ్యపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష... ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి. మొత్తంగా రాజుగా.. సాధారణ వ్యక్తిగా కళ్యాణ్ రామ్ ఆహార్యం బాగుంది. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసాడు.

    NBK 107 : రాఖీ పండగ రోజున అభిమానులకు బాలయ్య అదిరిపోయే సర్‌ఫ్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..


    ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ గెటప్ బాగుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి థియేటర్స్‌లో విడుదల కానుంది.  టైమ్ మిషన్, సైన్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bimbisara Movie, Bimbisara Movie Review, Kalyan Ram Nandamuri, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు