హోమ్ /వార్తలు /సినిమా /

Kalyan Ram - Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ నుంచి బిగ్ అప్టేట్..

Kalyan Ram - Bimbisara : నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ నుంచి బిగ్ అప్టేట్..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ అప్టేట్ (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ అప్టేట్ (Twitter/Photo)

Kalyan Ram As Bimbisara - NKR 18 | నంద‌మూరి కథానాయకుల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌.తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్టేట్‌ను సినిమా యూనిట్ రివీల్ చేసింది.

  Kalyan Ram As Bimbisara - NKR 18 | నంద‌మూరి కథానాయకుల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌. ఈయ‌న కథానాయకుడే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తాజాగా ఈయన హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఇప్పటికే  అన్న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేసారు. ఈ టైటిల్‌తో పాటు పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నారు. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు. ఇది చారిత్రక సినిమానా.. లేకపోత కాల్పినిక కథాంశంతో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీనా  అనేది తెలియాల్సి ఉంది.

  మొత్తంగా కళ్యాణ్ రామ్.. బాహుబలి లెవల్లో శత్రు సంహారం చేసిన యోధుడిలా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రం ‘మగధీర’ లెవల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ‘అఖండ’ రిలీజ్ రోజున థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.

  ఎంతమంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న  సినిమా ‘బింబిసార’.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్.

  Tollywood Family Multistarers : తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ మొదలైన ఫ్యామిలీ మల్టీస్టారర్స్ సందడి..


  మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది. ఎపుడు తెరకెక్కించారు తదితర విషయాలన్ని గోప్యంగా ఉంచి ఈ సినిమాను అత్యంత పకడ్బందీగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు.

  Nagarjuna - K Raghavendra Rao : నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..


  కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, NTR Arts, Tollywood

  ఉత్తమ కథలు