Home /News /movies /

NANDAMURI KALYAN RAM BIMBISARA MOVIE SPECIAL POSTER RELEASED DUE TO NTR 100TH BIRTH ANNIVERSARY TA

Kalyan Ram - Bimbisara : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల..

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల (Twitter/Photo)

Kalyan Ram - Bimbisara : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అంతేకాదు ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు.

    Kalyan Ram As Bimbisara - NKR 18 | నంద‌మూరి కథానాయకుల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌ (Kalyan Ram )కథానాయకుడే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. మరోసారి ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది.ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘మగధీర’ లెవల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది. ఈ

    సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇక ఆ మధ్య సినిమా టీజర్‌ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందని ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.

    కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ స్పెషల్ పోస్టర్ (Twitter/Photo)


    ఎంతమంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న  సినిమా ‘బింబిసార’.  ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. గతంలో విడుదల చేసిన పోస్టర్‌‌లో ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’. చెడు నుంచి ఎలా జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ అనేది ట్యాగ్ లైగ్.

    F3 - 1st Day WW Collections : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘F3’ మూవీ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

    ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bimbisara Movie, Kalyan Ram Nandamuri, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు