Home /News /movies /

NANDAMURI KALYAN RAM BIMBISARA MOVIE REVIEW AND RATING TIME TRAVEL VISUAL THRILLER TA

బింబిసార (Bimbisara)
బింబిసార (Bimbisara)
3/5
రిలీజ్ తేదీ:5/8/2022
దర్శకుడు : మల్లిడి వశిష్ఠ్ (Mallidi Vassist)
సంగీతం : కీరవాణి,చిరంతన్ భట్
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , కేథరిన్, సంయుక్తా మీనన్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి,  తదితరులు..
సినిమా శైలి : టైమ్ ట్రావెల్ థ్రిల్లర్
సినిమా నిడివి : 2 Hr 26 Minits

Bimbisara Movie Review : బింబిసార మూవీ రివ్యూ.. ఆసక్తి రేకిత్తించే టైమ్ ట్రావెల్ విజువల్ థ్రిల్లర్..

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ 4 డేస్ బాక్సాపీస్ కలెక్షన్స్ (Twitter/Photo)

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ 4 డేస్ బాక్సాపీస్ కలెక్షన్స్ (Twitter/Photo)

Nandamuri Kalyan Ram as Bimbisara Movie Review : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘బింబిసార’. తొలిసారి ఈ సినిమాలో త్రిగర్తల చక్రవర్తి బింబిసారుడి పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన గెటప్‌తో పాటు సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో.. ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ మెప్పించడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
రివ్యూ : బింబిసార   (Bimbisara)
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , కేథరిన్, సంయుక్తా మీనన్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి,  తదితరులు..
ఎడిటర్: తమ్మి రాజు
సినిమాటోగ్రఫీ: ఛోటా కే నాయుడు
సంగీతం: కీరవాణి, చిరంతన్ భట్
నిర్మాత : హరికృష్ణ
దర్శకత్వం: మల్లిడి వశిష్ఠ్
విడుదల తేది : 5/8/2022

నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పటి కప్పుడు డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే ఇతను ఇపుడు ‘బింబిసార’ వంటి డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  తొలిసారి ఈ సినిమాలో త్రిగర్తల చక్రవర్తి  బింబిసారుడి పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన గెటప్‌తో పాటు సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో.. ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ మెప్పించడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

బింబిసారుడు (నందమూరి కళ్యాణ్ రామ్) త్రిగర్త రాజ్యానికి చక్రవర్తి. తన కనుచూపు మేర ఎక్కడ ఏ చిన్న సామ్రాజ్యం ఉన్న.. దాన్ని తన అధీనంలోకి తీసుకొని సామంత రాజ్యంగా చేసుకోవాలని చూస్తుంటాడు. అతని సామ్రాజ్య విస్తరణ కాంక్షకు దయ, జాలి లాంటివి అసలు చూపని కర్కోటకుడు. ఈ  నేపథ్యంలో ఒక పండితుడి శాపానికి గురువుతాడు. ఈ నేపథ్యంలో  అతను అనుకోకుండా అతను ప్రస్తుత కాలానికి వస్తాడు. ఈ నేపథ్యంలో అతను ఓ నిధిని దాచిపెడతాడు. అందులో వైద్యానికి సంబంధించిన ధన్వంతరి పుస్తకం ఉంటోంది. పుస్తకం అందుకోవడానికి ప్రస్తుత కాలంలో ఓ వ్యక్తి ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రాజుల కాలం నుంచి వర్తమాన కాలంలోకి వచ్చిన  బింబిసారుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తిరిగి అతను తన కాలానికి వెళ్లాడా ? ఆ నిధి ఏమైంది  లేదా అనేది బింబిసార స్టోరీ.

కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు వశిష్ఠ.. చిన్నపుడు చందమామ, బాలమిత్ర వంటి కామిక్స్ బుక్స్‌లో కథలను ప్రేరణగా తీసుకొని ’బింబిసార’ కథను రాసుకున్నాడు. ఒక కథను రాసుకోవడమే కాదు.. దాన్ని సరైన విధానంలో స్క్రీన్ ప్లే‌ ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ సాధించాడు. సినిమా ప్రారంభం నుంచి చివరకు వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గెటప్‌ అతను రాసుకున్న విధానం .. దాన్ని యథాతదంగా తెర రూపమిచ్చాడు. కళ్యాణ్ రామ్‌లో నటనను సరైన విధానంలో రాబట్టుకున్నాడు. మొత్తంగా క్రీ.పూ 500 సంవత్సారానికి ప్రస్తుత కాలానికి లింకు చేసిన విధానం బాగుంది. ఇలాంటి ఫాంటసీ మూవీలకు లాజిక్స్‌ను పక్కన పెడితే.. ఒక చందమామ కథను చదివిన వాళ్లకు ఈ సినిమా చూస్తుంటే.. ఆ పాట జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.

ఈ సినిమాకు దర్శకుడు వశిష్ఠ్ తర్వాత ఈ సినిమాకు తన రీ రికార్డింగ్‌తో ప్రాణం పోసాడు కీరవాణి. ఈ సినిమాకు అసలు సిసలు హీరో అనే చెప్పాలి. అంతేకాదు అప్పటి కాలానికి ప్రస్తుత వర్తమానాన్ని తన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నాడు. గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. ఎడిటర్ కూడా తన కత్తెరకు బాగానే పని చెప్పాడు.

నటీనటుల విషయానికొస్తే..

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయడని ఇలాంటి ఫాంటసీ తరహా పాత్రను ఈ సినిమాలో కొత్త చూపించాడు. ముఖ్యంగా బింబిసారుడిగా అతని విలనిజం ఇంకాస్తా బాగా చేయాల్సింది.బింబిసారుడిగా మరింత క్రూరత్వం తప్పించి సినిమా మొత్తం తన భుజ స్కందాలపై మోసాడు. ఇక వర్తమానంలో గతంలో రాజుగా తాను చేసిన తప్పులను తెలుసుకునే సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంది. ఇక రాజకుమారి పాత్రలో నటించిన కేథరిన్ తన పరిధి మేరకు నటించింది. సంయుక్త మీనర్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఒక మాంత్రికుడిగా అయ్యప్ప పి. శర్మ నటన బాగుంది. ప్రకాష్ రాజ్ నటనతో పాటు విలన్ పాత్రలో నటించిన నటుడికి సరైన స్కోప్ లభించలేదు.

ప్లస్ పాయింట్స్

కథ, స్క్రీన్ ప్లే

ఫస్టాఫ్

కీరవాణి రీ రికార్డింగ్

చోటా కే నాయుడు కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్

సరైన విలన్ పాత్ర

హీరోయిన్ పాత్రలు

చివరి మాట : ఆసక్తి రేకిత్తించే టైమ్ ట్రావెల్ విజువల్ థ్రిల్లర్..

రేటింగ్ : 3/5
Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
3.5/5
స్క్రీన్ ప్లే:
3.5/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
3.5/5

Tags: Bimbisara Movie, Kalyan Ram Nan, Tollywood

తదుపరి వార్తలు