Kalyan Ram As Bimbisara - NKR 18 | నందమూరి కథానాయకుల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram )కథానాయకుడే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత కూడా. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara) . ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల విషయంలో టీమ్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈరోజు ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ (Bimbisara) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది.
ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా (Bimbisara) కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘మగధీర’ లెవల్లో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇక ఆ మధ్య సినిమా టీజర్ విడుదలై మంచి ఆదరణ పొందింది.
The date is locked for BIMBISARA to ascend the throne ?#Bimbisara grand release on 5th August ?#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/WLkkNeNM7H
— BA Raju's Team (@baraju_SuperHit) April 2, 2022
King #Bimbisara continues his dominance on @YouTubeIndia ??#BimbisaraTeaser Trending with 7M+ views ? ▶️ https://t.co/Vw7haf6qei@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/5eAotJS44B
— NTR Arts (@NTRArtsOfficial) December 4, 2021
ఇక కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) ‘బింబిసార’ (Bimbisara) మూవీతో పాటు .. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram ) తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.