హోమ్ /వార్తలు /సినిమా /

Nandamuri Kalyan Ram: అమిగోస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే స్ట్రీమింగ్ అంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్

Nandamuri Kalyan Ram: అమిగోస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే స్ట్రీమింగ్ అంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్

Amigos Twitter

Amigos Twitter

Amigos OTT Release Date: ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న అమిగోస్ మూవీ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గతేడాది బింబిసారతో హిట్‌తో బంపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram).. రీసెంట్ గానే అమిగోస్ (Amigos) అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు (Amigos OTT Release date). ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చేశారు.

మార్చి 10న ఓటీటీలో 'అమిగోస్' విడుదల కానుందంటూ ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదు. తాజాగా వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ 1 నుంచి అమిగోస్ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంత చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.

కళ్యాణ్ కెరీర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహించగా.. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ ఫీమేల్ లీడ్ గా నటించింది. విడుదలకు ముందు వదిలిన టీజర్, ట్రైలర్ లతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం విశేషం. మనిషిని పోలిన మనుషులు ప్రపచరంలో ఏడుగురు ఉన్నారని చెబుతారు కదా! అందులో ముగ్గురు కలిస్తే? అనే కోణంలో ఈ సినిమా కథ సాగింది.

కన్నడ భామ ఆషికా రంగనాథ్ ఈ అమిగోస్ సినిమాతో తెలుగు తెరపై కాలుపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. కథ పరంగా సినిమా ఓకే అనిపించినా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో మాత్రం విఫలం అయ్యింది అమిగోస్. సో.. చూడాలి మరి ఓటీటీ వేదికపై ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది!.

First published:

Tags: Amigos, Kalyan Ram Nandamuri, Netflix

ఉత్తమ కథలు