హోమ్ /వార్తలు /సినిమా /

Nandamuri Kalyan Ram: ఓటీటీలో నందమూరి హీరో అమిగోస్.. స్ట్రీమింగ్ లేట్ కావడానికి కారణమిదే..!

Nandamuri Kalyan Ram: ఓటీటీలో నందమూరి హీరో అమిగోస్.. స్ట్రీమింగ్ లేట్ కావడానికి కారణమిదే..!

Amogos

Amogos

Amigos On OTT: నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అమిగోస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమాను ఓటీటీ వేదికపైకి తీసుకొచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అమిగోస్ () ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమాను ఓటీటీ వేదికపైకి తీసుకొచ్చారు. నిజానికి అనుకున్న సమయానికంటే ఈ సినిమాను కాస్త ఆలస్యంగా ఓటీటీ వేదిక పైకి తీసుకొచ్చారు. అయితే ఇందుకు కారణం నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంతో నిర్మాతలు కుదుర్చుకున్న ఓ ఒప్పందమే అని తెలుస్తోంది.

గతేడాది బింబిసారతో హిట్‌తో బంపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా ఈ అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. తొలుత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ క్రమంగా డీలా పడింది. దీంతో కలెక్షన్స్ పరంగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.

కళ్యాణ్ కెరీర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహించగా.. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ ఫీమేల్ లీడ్ గా నటించింది. కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని తెలిసి జనాల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది కానీ విడుదల తర్వాత అదేమీ వర్కవుట్ కాలేదు. థియేటర్స్ లో ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

ఓటీటీ వేదికపై ఈ థ్రిల్లర్ మూవీ చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. సో.. చూడాలి మరి ముందు ముందు ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ వ్యూస్ రాబడుతుందనేది!.

First published:

Tags: Amigos Movie, Kalyan ram, Tollywood

ఉత్తమ కథలు