మీడియా అంతా ఇప్పుడు మెగా డాటర్ నిహారిక పెళ్లి గురించి చర్చించుకుంటుంది. అక్కడ ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మరో కుటుంబంలో కూడా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నందమూరి కుటుంబంలో కూడా ఇప్పుడు పెళ్లి సందడి కనిపిస్తుంది. కాకపోతే కోవిడ్ సందర్భంగా అస్సలు విషయం బయటికి రానివ్వలేదు నందమూరి కుటుంబ సభ్యులు. కేవలం సన్నిహితుల సమక్షంలోనే కార్యక్రమం పూర్తి చేసారు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ నిశ్చితార్థ వేడుక డిసెంబర్ 6న హైదరాబాద్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. బాలయ్య వచ్చి అబ్బాయిని ఆశీర్వదించాడు. అయితే ఈ విషయాన్ని మీడియాలో ఎక్కువగా హైలైట్ చేయలేదు.. నిజానికి నందమూరి కుటుంబ సభ్యులే ఈ నిశ్చితార్థం సందడి లేకుండా జరిపించేసారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగానే జరిగినా బయట మాత్రం ఎక్కువగా సందడి కనిపించలేదు. చైతన్య కృష్ణ నటుడిగా కూడా ఓ సినిమా చేసాడు.

నందమూరి చైతన్య కృష్ణ నిశ్చితార్థం (nandamuri chaitanya krishna)
దాదాపు 17 ఏళ్ల కింద జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమా గుర్తుందా.. అందులో మరో హీరోగా నటించాడు చైతన్య. అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీ వైపు చూడలేదు ఈయన. తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. మధ్యలో రాజకీయాల్లో కూడా కనిపించాడు. ఆ మధ్య వల్లభనేని వంశీ, కొడాలి నానిపై విరుచుకుపడ్డాడు చైతన్య కృష్ణ. మీరు ఏం మాట్లాడినా చూస్తూ కూర్చోడానికి ఇక్కడ గాజులు తొడుక్కుని ఎవరూ లేరంటూ డైలాగులు కూడా చెప్పాడు చైతన్య కృష్ణ.

నందమూరి చైతన్య కృష్ణ నిశ్చితార్థం (nandamuri chaitanya krishna)
ఇప్పుడు ఈయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కుటుంబంలో కొన్నేళ్లుగా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పటికీ కుదరడంతో నిశ్చితార్థం ఘనంగా జరిపారు నందమూరి కుటుంబ సభ్యులు. త్వరలోనే పెళ్లి తేదీ ప్రకటించనున్నారు. అన్నట్లు అన్నయ్య నిశ్చితార్థ వేడుకలో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఈయన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:December 07, 2020, 16:37 IST